Advertisement
ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది చాలా ముఖ్యం. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితం కూడా మారుతూ ఉంటుంది. పెళ్లి తర్వాత ఆడపిల్ల ఓ కొత్త ఇంటికి వస్తుంది. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంది. అనేక పద్ధతుల్ని పాటించడం మొదలు పెడుతుంది. పుట్టింట్లో వేరుగా ఉంటే అత్తింట్లో పద్ధతులు అన్ని వేరుగా ఉంటాయి. తమకు నచ్చిన భాగస్వామి జీవితంలోకి వస్తే కలకాలం సంతోషంగా ఉండొచ్చు. పెళ్లి చేసుకునే సమయంలో వెనక ముందు అన్ని ఆలోచించుకుని ముందడుగు వేయాలి. పెళ్లి చేసుకున్న తర్వాత ఒక నూతన వధూవరులు ఇద్దరి మధ్య ఒక విషయంపై చర్చ వస్తూ ఉంటుంది. అదే ఇంటి పేరు మార్చుకోవడం.
Advertisement
మెట్టింటికి వచ్చిన తర్వాత భర్త ఇంటి పేరును తన ఇంటిపేరుగా మార్చుకోవాలా వద్దా అని చాలామంది ఆడవాళ్లు సందేహంలో ఉంటారు. ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు పెళ్లయిన తర్వాత భర్త ఇంటి పేరుని తమ ఇంటి పేరుగా మార్చుకుంటుంటే కొంతమంది మాత్రం పుట్టింటి పేరునే కొనసాగిస్తున్నారు ఇలా పెళ్లయిన తర్వాత అటు భర్త ఇంటి పేరును భార్య తన ఇంటి పేరుగా మార్చుకోవాలంటే ఎవరిదైనా పర్మిషన్ తీసుకోవాలా వద్దా అనే విషయం గురించి అనుమానాలు ఉన్నాయి.
Advertisement
Also read:
ఈ విషయంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి తర్వాత మెట్టింటికి వెళ్లిన వివాహితులు తమ ఇంటి పేరుని మార్చుకోవాలి అంటే భర్త నుంచి ఎస్ఓసి తప్పనిసరి అని కేంద్రం స్పష్టం చేసింది. పేరు మార్పు ప్రక్రియలో ప్రభుత్వం చేసిన పలు మార్పులను సవాల్ చేస్తూ 40 ఏళ్లు మహిళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ అంశం ఇటీవల రాజ్యసభలో ప్రస్తావన రాగా.. భార్య ఇంటి పేరును తీసేసి భర్త ఇంటి పేరుని మార్చుకునేందుకు తప్పనిసరిగా భర్త నుండి పర్మిషన్ అవసరం అన్న నిబంధన ద్వారా చట్టపరమైన సమస్యల్ని నివారించవచ్చు అని కేంద్రం అభిప్రాయపడింది. హైకోర్టులో దాఖలైన ఈ పిటిషన్ పై ఆగస్టు 7వ తేదీన మళ్లీ విచారణ జరగనుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!