Advertisement
Tiragabadara Saami Review: రాజ్ తరుణ్ హీరోగా నటించిన తిరగబడిరా సామి సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన మన్నారా చోప్రా నటించారు. మాల్వి మల్హోత్రా, మకరంద్ దేశ్‌పాండే తదితరులు ఈ సినిమాలో నటించారు. తిరగబడతారా సామి సినిమాతో రాజ్ తరుణ్ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రాజ్ తరుణ్ ఈ సినిమాతో ఆడియెన్స్ ని మెప్పించాడా..? ఈ సినిమా కథ రివ్యూ రేటింగ్ గురించి ఇప్పుడే చూద్దాం.
Advertisement
సినిమా: తిరగబడరా సామీ
నటులు: రాజ్ తరుణ్,మన్నారా చోప్రా, మాల్వీ మల్హోత్ర, మకరంద్ దేశ్‌పాండే
దర్శకుడు: ఏ ఎస్ రవి కుమార్ చౌదరి
రిలీజ్ డేట్: 02-08-2024
కథ మరియు వివరణ:
గిరి (రాజ్ తరుణ్) తప్పిపోయిన వాళ్ళని కనిపెట్టి వారి కుటుంబానికి దగ్గర చేయడమే పనిగా పెట్టుకుంటాడు. చిన్నతనంలో తాను కూడా తప్పిపోయి ఓ అనాధలా మారిపోతాడు. ఆ బాధ తెలుసు కనుక ఇలా మిస్ అయిన వాళ్ళని తిరిగి చేరుస్తూ ఉంటాడు. చిన్నతనంలో గిరిని ఆటో జానీ చేరతీస్తాడు. ఆ కాలనీలో మటన్ మస్తాన్, తులసమ్మ ఇలా అందరూ గిరిని ప్రేమగా చూస్తారు. భయస్తుడైన గిరి గొడవలకి దూరంగా ఉంటాడు. తనకంటూ ఓ మంచి కుటుంబం ఏర్పడాలని కలలు కంటూ ఉంటాడు అలాంటి జీవితంలోకి శైలజ వస్తుంది. శైలజ వచ్చాక గిరి జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి..? శైలజ బ్యాక్ గ్రౌండ్ ఏంటి..? గిరికి వచ్చిన సమస్య ఏంటి..? గిరి శైలజ లైఫ్ లోకి ఎందుకు వస్తాడు..? శైలజను కాపాడుకునేందుకు గిరి ఏం చేస్తాడు అనేది సినిమా కథ.
Also read:
Advertisement
ఈ సినిమా ఇప్పుడు రావాల్సిన సినిమా కాదు. పాతబడిన కథను మళ్లీ మళ్లీ తిప్పి తిప్పి చూపించినట్లు అందరికీ అనిపిస్తుంది. కథ కొత్తగా ఉండదు సరి కదా అస్సలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేదు. సీరియల్ యాక్టర్స్ ఎమోషన్స్ ను క్యాప్చర్ చేసినట్లుగా సీన్స్ కట్స్ ఉంటాయి. ప్రతి సీన్ కాట్ కాపీ పేస్ట్ లా ఉంటుంది. కంటిన్యూటీ ఉండదు. అసలు సినిమాలోనే కథ ఉండదు సినిమా ప్రారంభంలో ఓ విలన్ ని క్రూరంగా చూపిస్తారు కానీ అతని వల్ల కథకు ఒరిగిందేమీ లేదు అసలు ఒక క్యారెక్టర్ ని ఎందుకు పెట్టారో కూడా తెలియదు. హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ తెరపై రొమాన్స్ బాగానే కుదిరినట్లు కనబడుతుంది. కాలనీవాసులు ఓవరాక్షన్ మాత్రం ఇరిటేట్ అయ్యేలా చేస్తుంది. ప్రతి పాత్ర అసలు ఆడియన్స్ కి నచ్చదు. ఏ ఒక్క సీన్ కూడా కొత్తగా ఊహకు మించేలా ఉండదు. ఫస్ట్ హాఫ్ ఇలానే ఉంటుంది. కథ ఎమోషనల్ సంఘర్షణ సెకండ్ హాల్ఫ్ లో ఉంటుందేమో అని ఆడియన్స్ అనుకుంటే అది తప్పు. విలన్ గ్యాంగ్ లోని కమెడియన్ తో చేయించిన సీన్లు వరస్ట్ గా అనిపిస్తాయి.
Also read:
ప్లస్ పాయింట్స్:
హీరో, హీరోయిన్ల కెమిస్ట్రీ
అక్కడక్క సీన్స్
మైనస్ పాయింట్స్:
రొటీన్ స్టోరీ
కొత్తదనం లేకపోవడం
ఓవర్ గా అనిపించే సీన్స్
రేటింగ్: 1.5/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!