Advertisement
వేలంలో కొనుగోలు చేసాక అందుబాటులో ఉండని విదేశీ ప్లేయర్లను నిషేధించాలని సన్ రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్య మారన్ బీసీసీ ఐపీఎల్ మీటింగ్లో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. గాయంతో దూరమైన పర్వాలేదు కానీ ఇతరాత్ర కారణాలతో సీజన్ కి అందుబాటులో లేకపోతే సీరియస్ యాక్షన్ తీసుకునేలా నిబంధనలు చేయాలని ఆమె సూచించారు. శ్రీలంక ఆల్ రౌండర్ హసరంగ కారణంగా కావ్య ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. గత వేలంలో హసరంగను సన్రైజర్స్ ఒకటిన్నర కోట్లు పెట్టి దక్కించుకుంది.
Advertisement
గాయం కారణంతో అతను ఐపీఎల్ 2024 నుంచి తప్పుకున్నారు. 2023 వరకు RCBతో ఆయనకు కాంట్రాక్ట్ ఉండేది కానీ RCB వదులుకోవడంతో వేలంలోకి వచ్చిన అతన్ని SRH దక్కించుకుంది అతనే కాకుండా కొంతమంది విదేశీ ప్లేయర్లు ఐపీఎల్లో తెలివిగా వ్యవహరిస్తున్నారు. మెగా వేలానికి కాకుండా మినీ వేలానికి మాత్రమే అందుబాటులో ఉంటున్నారు మినీ ఆక్షన్ లో భారీ ధరను సొంతం చేసుకుంటున్నారు. 2018-24 మధ్యలో రెండు సార్లు మెగా వేలం జరిగింది.
Advertisement
Also read:
ఈ మెగా ఆక్షన్ లో అత్యధిక ధర 15.25 కోట్లు 2022లో ఈ భారీ మొత్తాన్ని ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్ పై వెచ్చించింది. కానీ 2024 సీజన్ కోసం నిర్వహించిన మినీ వేలంలో స్టార్క్ 24.75 కోట్లు, కమింగ్ 20.5 0 కోట్ల ధర పలికారు. ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు వ్యూహాత్మకంగా మినీ వేలంలోనే పేర్లను నమోదు చేసుకుంటున్నారని అభిప్రాయాలు ఉన్నాయి.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!