Advertisement
రాజమౌళి జడ్జిమెంట్ సినిమాల విషయంలో పూర్తిస్థాయిలో పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఏ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో ఆయన సరిగ్గా చెప్పగలరు. కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. నిహారిక మాట్లాడుతూ.. యాక్టింగ్ అంటే నాకు ఎంతో ఇష్టమని చెప్పారు. నటిగా రాణించాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించాలని ఆమె అన్నారు.
Advertisement
విశ్వక్సేన్ హీరోగా యాక్ట్ చేసిన ఒక షార్ట్ ఫిలిం కోసం నన్ను హీరోయిన్గా అడిగారని నిహారిక అన్నారు కొన్ని కారణాల వలన ఆ షార్ట్ ఫిలింకు ఒక సాంగ్ వరకు మాత్రమే నేను వర్క్ చేశాను అని ఆమె అన్నారు. అఖిల్ హీరోగా జక్కన్న కొడుకు కార్తీకేయ డైరెక్షన్లో తెరకెక్కిన షార్ట్ ఫిలింలో హీరోయిన్ గా చేశానని నిహారిక అన్నారు. రాజమౌళి ఆ షార్ట్ ఫిలింను చూసి షార్ట్ ఫిలింను రిలీజ్ చేయకపోవడమే మంచిది అని సూచించారని నిహారిక అన్నారు. నా తొలి షార్ట్ ఫిలిం అదేనని నిహారిక చెప్పారు.
Advertisement
Also read:
నాకు సినిమాల్లోకి రావాలని ఉందని ఒకసారి పెదనాన్నకు చెప్పానని నిహారిక అన్నారు. పెదనాన్న సినిమాల్లోకి వస్తే ప్రశంసలతో పాటు నెగెటివిటీ ని కూడా ఎదుర్కోవాలని చెప్పారని నిహారిక అన్నారు. ఇండస్ట్రీ వాతావరణం ఎలా ఉంటుందో పెదనాన్న నాకు వర్ణించారని నిహారిక అన్నారు. అది విన్నాక భయం వేసిందని సినిమాల్లోకి రావాలని అనిపించింది అని చెప్పారు. ఆ తర్వాత ఒక మనసు స్క్రిప్ట్ విని అందులో పాత్ర నచ్చి వెంటనే ఒప్పుకున్నాను అని నిహారిక చెప్పారు. ప్రస్తుతం నిహారిక చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!