Advertisement
సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు రోజా. టీడీపీలో సుదీర్ఘకాలం సాగిన ఆమె తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలుగా మాత్రం వ్యవహరించగలిగారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీలోకి అడుగు పెట్టాలని చూసారు. ఆమెకు టీడీపీలో అవకాశం దక్కలేదు. వైసీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. మొన్న ఎలక్షన్స్ లో ఆమె పరాజయం ఎదుర్కొన్నారు. అధికారంలో ఉన్న రోజుల్లో యాక్టివ్ గా పని చేస్తున్న ఆమె ఇప్పుడు చెన్నైకి పరిమితమవుతున్నారు.
Advertisement
తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్ల వ్యవహారం ఇతర కేసుల్లో కేసులు చుట్టుముట్టే అవకాశం ఉంది. అప్పుడప్పుడు నగరి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఓడిపోయాక వైసీపీ శ్రేణుల సమావేశం కూడా నిర్వహించలేదు. సొంత పార్టీలోనే ఆమెకు వ్యతిరేకత ఏర్పడింది. ఆపై కూటమి అధికారంలోకి వచ్చింది. స్థానికంగా ఉంటే ఇబ్బందులు తప్పవని ఆమె భావిస్తున్నారు. అందుకని చెన్నైకు మకాం మార్చారు అక్కడే సినీ టీవీ రంగాల్లో అవకాశాల కోసం చూస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో విభిన్న పరిస్థితి ఉంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తెలంగాణలో రేవంత్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతోంది. గతంలో ఆమె KCRకు అనుకూలంగా వ్యవహరించారు. రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందుకే తెలుగు టీవీ పరిశ్రమలో ఆమె అవకాశం పొందే ఛాన్స్ లేదు. అందుకే కన్నడ తో పాటుగా తమిళంలో బుల్లితెరపై కొన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!