Advertisement
కన్నడ హీరో దర్శన్ ను అరెస్ట్ చేయడం సంచలనాన్ని సృష్టించింది. తన ప్రియురాలని వేధిస్తున్న రేణుక స్వామి అనే తన అభిమానిని అత్యంత కిరాతకంగా హత మార్చడం మృతదేహాన్ని మాయం చేయడానికి ప్రయత్నించడం తదితర అభియోగాల వలన దర్శన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అసిస్టెంట్ కెమెరామెన్ స్థాయి నుంచి టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. సినిమాకు 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే ఈయన 2003లో విజయలక్ష్మి అనే మహిళను పెళ్లి చేసుకున్నారు.
Advertisement
వీరికొక బాబు కూడా ఉన్నాడు. అయితే నటి నికితతో గతంలో దర్శన్ సన్నిహితంగా ఉన్నట్లు వార్తలు వేధిస్తున్నాడని విజయలక్ష్మి పోలీసులకి కంప్లైంట్ చేసింది. సదరు హీరోను అరెస్ట్ చేసి 14 రోజులు జైల్లో పెట్టారు. తర్వాత పవిత్ర గౌడ్ తో దర్శన్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లుగా గాసిప్స్ వచ్చాయి. నటిగా ఫ్యాషన్ డిజైనర్ గా పేరు నా పవిత్రకు గతంలో పెళ్లయింది. ఒక కూతురు కూడా ఉంది. అయితే మనస్పర్ధలు కారణంగా వీళ్ళిద్దరూ విడిపోయారు. దర్శన్ కు దగ్గర మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది అతనితో దిగిన ఫోటోలని పవిత్ర గౌడ తరచు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేది. అయితే ఈ క్రమంలో రేణుక స్వామి అనే దర్శన్ ఫ్యాన్ తట్టుకోలేక పోయి తన అభిమాన హీరోకు అతని భార్యకు పవిత్ర అన్యాయం చేస్తుందని వారి సంసారం నాశనం చేసిందని బహిరంగంగా కామెంట్స్ చేసేవాడు.
Advertisement
Also read:
పవిత్ర సోషల్ మీడియా ఖాతాకు కూడా అసభ్యకరమైన సందేశాలను ఫోటోలని పంపించేవాడు. దీంతో అతన్ని దర్శన్ కిడ్నాప్ చేసి బెంగళూరు లో ఒక షెడ్ లో హత్యకు ముందు షాక్ ఇచ్చి చిత్రహింసలు పెట్టాడని.. వాటిని పవిత్ర కళ్ళారా చూశారని పోలీసులు విచారణలో తేలింది. దర్శన్ ని అరెస్ట్ చేశాక పలుసార్లు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నా కోర్టు వాటిని తిరస్కరించింది విచారణ అనంతరం ఆగస్టు 14 వరకు నిందితుల జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. సాక్ష్యాధారాలు నాశనం చేసేందుకు నిందితులు తీవ్రంగా ప్రయత్నించారని.. అలాంటిది బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలిగిస్తారని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు దీంతో బెయిల్ ని తిరస్కరించారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!