Advertisement
మన దేశంలో ఏ వాహనానికైనా సరే రిజిస్టర్ అయిన ప్రాంతాన్ని బట్టి నెంబర్ ప్లేట్ ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన వాహనాలకు ఆ రాష్ట్రం అక్షరాలు ముందుగా నంబర్ ప్లేట్ మీద వస్తాయి. తర్వాత జిల్లా అనంతరం రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటాయి. ఏ రాష్ట్రంలోని వాహనాలకు అయినా సరే నెంబర్లను కేటాయిస్తారు. ఆర్మీ వాహనాలకు మాత్రం నెంబర్ ప్లేట్లో భిన్నంగా ఉంటాయి. ఈ విషయాన్ని మీరు కూడా గమనించి ఉంటారు ఆ వాహనాల నెంబర్ ప్లేట్ పై ఉండే అక్షరాలు చిహ్నాలు కి అర్థం కూడా ఉంటుంది. ఆర్మీ వాహనం నెంబర్ ప్లేట్ అక్షరాలను గమనిస్తే నెంబర్ ప్లేట్ పై ముందుగా పైకి సూచించే బాణం చిహ్నం ఉంటుంది. ఇది ఎందుకు రాస్తారంటే దురదృష్టశాత్తు తిరగబడినప్పుడు నెంబర్ ప్లేట్ పై ఉండే అంకెలు లేదా అక్షరాలు రివర్స్‌లో కనపడతాయి.
Advertisement
Advertisement
అలాంటప్పుడు వాటిని తప్పుగా చదివే అవకాశం ఉంటుంది కానీ నంబర్ ప్లేట్ పై ముందుగా బాణం ఉన్నట్లయితే నెంబర్లను సరిగ్గా చదవడానికి అవుతుంది. మొదట రెండు అంకెలు అది ఏ సంవత్సరంలో కొనుగోలు చేసారు అనే దానికి అర్థం. అలాగే తర్వాత ఉండే ఇంగ్లీష్ అక్షరం వాహన రకాన్ని సూచిస్తుంది.
Also read:
ఉదాహరణకు B అని ఉంటే రవాణాకు వాడతారు. B కి బదులు A ఉన్నట్లయితే బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు అని అర్థం. C అని ఉంటే వాహనాలు తవ్వకాల కోసం లేదా క్రేన్లుగా వాడతారని అది సూచిస్తుంది. తర్వాత ఉండే ఆరు అంకెలు వాహనం యొక్క సీరియల్ నెంబర్ W అనే అక్షరం చెకింగ్ కోడ్ గా పని చేస్తుంది. ఇలా ఆర్మీ నెంబర్ ప్లేట్ అక్షరాలు వెనక ఉన్న అర్థం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!