Advertisement
దర్శక ధీరుడు రాజమౌళి గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తెలుగు సినీ స్థాయిని పెంచేశారు రాజమౌళి. సినిమా షూటింగ్ టైంలో అవుట్ పుట్ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటూ తప్పులుంటే సరిదిద్దుకోవడం చిరంజీవికి అలవాటు. ఏమైనా చిన్న తప్పు జరిగినా వందలాది మంది కష్టం డబ్బు వృధా అవుతుందని మెగాస్టార్ ఉద్దేశం. రాజమౌళి కూడా సినిమాను తరికెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా వహిస్తారు. రోజు రా ఫుటేజ్ చెక్ చేసుకోవడం తప్పులు ఏమైనా ఉంటే మళ్ళీ చూసుకోవడం చేస్తారు. సినిమాను శిల్పంలా చెక్కుతారు కనుక రాజమౌళిని ఎన్టీఆర్ ముద్దుగా జక్కన్న అని పిలుస్తారు.
Advertisement
భారతదేశం గర్వపడే గొప్ప దర్శకుడుగా మారారు. అయితే ఈ క్రమంలో చిరంజీవి సినిమాలోని ఓ సీన్ విషయంలో జక్కన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ సీన్ చూసి బాగా ఎమోషనల్ అయ్యానని.. కానీ హీరోకి ఆ గుర్రానికి ఎలాంటి అటాచ్మెంట్ లేదనిపించిందని మనకు సహాయం చేసిన వ్యక్తికి థాంక్స్ చెప్పకపోతే ఆ ఫీలింగ్ ఎలా సంపూర్ణమవుతుందని రాజమౌళి అడిగారు.
Advertisement
Also read:
కొదమ సింహం సినిమాలో రౌడీలు మెగాస్టార్ చిరును పీకలోతు ఇసుకలో పాతిపెట్టి వెళ్తారు గుర్రం చిరంజీవి నోటికి తాడు అందించి కాపాడుతుంది. ఆ సీన్ గురించే రాజమౌళి ఇలా కామెంట్స్ చేసారు. దీనిని బేస్ చేసుకునే మగధీరలో ఇసుక ఊబిలో కూరుకుపోయిన హీరో బయటకు వచ్చాక గుర్రానికి కౌగలించుకుంటాడని, ఓ మిత్రుడు ఇలా దానిని చూస్తూ కృతజ్ఞతాగా మాట్లాడతాడని ఆయన చెప్పారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!