Advertisement
ప్రతిదీ కూడా తల్లిదండ్రుల నుండి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల నుండి పిల్లలు ఎటువంటి అలవాట్లను నేర్చుకుంటారు అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. పిల్లలు సున్నిత మనస్కులు. చుట్టూ ఉన్న వారి ప్రవర్తన వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. సాధారణంగా తల్లిదండ్రుల నుంచి వారు కొన్ని అలవాట్లను స్వీకరిస్తారు. తల్లిదండ్రులు వారి భావోద్వేగాలను ఎలా నియంత్రణ చేస్తున్నారో పిల్లలు దానినే గమనిస్తారు. వారు సమర్థవంతంగా నిర్ణయించగలిగితే పిల్లలు కూడా ఆ విషయంలో మెరుగ్గా ఉంటారు. అలాగే కమ్యూనికేషన్ నైపుణ్యం కూడా తల్లిదండ్రుల నుండి పిల్లలు నేర్చుకుంటారు.
Advertisement
తల్లిదండ్రులు ఒకరితో ఒకరు ఇతరులతో ఎలా సంభాషిస్తున్నారో పిల్లలు దాన్ని గ్రహిస్తారు. గౌరవప్రదమైన సంభాషణలు పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్ ని మెరుగు పరుస్తాయి. అలాగే పని పై బాధ్యత గల తల్లిదండ్రుల వైఖరి వారి పిల్లల ప్రవర్తన పై కూడా ప్రభావితం చేస్తుంది. అంకితభావంతో పనిచేస్తే పిల్లలు కూడా దానినే అలవాటు చేసుకుంటారు. అలాగే పిల్లల ఆహారపు అలవాట్లు వారి తల్లిదండ్రుల నుంచే అలవాటు అవుతాయి. తల్లిదండ్రులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటే పిల్లలు కూడా అటువంటి ఆహార పదార్థాలను తీసుకోవడానికి ఇష్టపడతారు.
Advertisement
Also read:
Also read:
తల్లిదండ్రులు శారీరకంగా శ్రమించి చురుకుగా ఉంటే పిల్లలు కూడా అదే అలవాటు చేసుకుంటారు. అలాగే తల్లిదండ్రులు సమాజంలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో పిల్లలు దానిని గమనిస్తారు. ఆ మార్గాన్నే వాళ్లు కూడా అనుసరిస్తారు. తల్లిదండ్రులు కూడా ఏదైనా విషయాన్ని నేర్చుకోవడంలో తెలుసుకోవడంలో ఉత్సాహాన్ని చూపిస్తే పిల్లలు కూడా అలాగే ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి తల్లిదండ్రులు ఈ విషయాలని గమనించి పిల్లల్లో మార్పుని తీసుకురావచ్చు. అప్పుడు పిల్లలు కూడా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనని గమనిస్తూ ఉండాలి. అలాగే మంచి అలవాట్లను అలవాటు చేయాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!