Advertisement
సినిమా ఇండస్ట్రీకి విశేష సేవలు అందించిన నటీమణులకు ఇతర సినీ సెలబ్రిటీలకు అవార్డులను ఇస్తూ ఉంటారు. ఎక్కువగా పద్మ విభూషణ్, పద్మశ్రీ వంటి అవార్డులు లభిస్తుంటాయి. ఒకప్పుడు సినిమాల్లో అద్భుతమైన నటనతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు వాణిశ్రీ. వాణిశ్రీ కి మాత్రం పద్మ విభూషణ్, పద్మశ్రీ వంటి అత్యున్నత పౌర పురస్కారాలు దక్కలేదు. 47 ఏళ్ళ కెరియర్ లో ఆమె 200 సినిమాల్లో ఎన్నో అద్భుతమైన పాత్రలు పోషించారు. హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.
Advertisement
పెళ్లయ్యాక ఆమె తల్లిగా కూడా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరించారు ఆమె కోట్లాదిమంది తెలుగువారి హృదయాలను గెలుచుకున్నారు. అయినప్పటికీ ఆమెకి ఇటువంటి అవార్డులు మాత్రం రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఆమెను గుర్తించకపోవడం చాలా బాధాకరం. ఆమెకు కో యాక్టర్లు అయిన శారదకి కానీ లక్ష్మికి కానీ అవార్డులు వచ్చాయి. వాణిశ్రీ కి మాత్రం కేంద్రం నుంచి ఎలాంటి పురస్కారం లభించలేదు. ఎందుకంటే అది అంతుపట్టని విషయం. 1978లో రిలీజ్ అయిన అనుగ్రహం సినిమా లో ఆమె అద్భుతంగా నటించారు.
Advertisement
Also read:
ఆ నటనకు బెస్ట్ యాక్టర్స్ గా నేషనల్ అవార్డు వస్తుందనుకున్నారు కానీ రాలేదు. వాణిశ్రీ కి పద్మశ్రీ పద్మ విభజన అవార్డులు రాకపోవడం లో ఆశ్చర్యం లేదు అని చాలామంది అంటున్నారు. వాణిశ్రీ చాలా ఛాలెంజింగ్ పాత్రలు కూడా పోషించారు. డాన్సులు కూడా బాగా వేశారు. ప్రజల అభిమానమే ఆమెకు వందల పద్మ పురస్కారాలతో సమానమని చెప్పవచ్చు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!