Advertisement
సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టారు నాని. తర్వాత హీరోగా వరుస సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు. ఇప్పుడు స్టార్ హీరోల్లో ఒకరిగా నిలిచారు. వరుస సినిమాల్లో నటిస్తూ ఇంకో పక్క నిర్మాతగా కూడా మారి సినిమాలను నిర్మిస్తున్నారు. త్వరలోనే నాని సరిపోదా శనివారం అనే సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధపడ్డారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే నాని ఈ సినిమా సందర్భంగా ప్రెస్ మీట్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.
Advertisement
ఈ కార్యక్రమంలో భాగంగా రిపోర్టర్స్ అయినను ప్రశ్నిస్తూ సినిమా చూసిన తర్వాత మీకు శనివారం అంటే చాలా ఇష్టంగా మారిపోయిందా అని అడిగారు. ఈ ప్రశ్నకు నాని సమాధానం చెబుతూ నాకు ఇప్పుడే కాదు చిన్నప్పటి నుంచి కూడా శనివారం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆదివారం సెలవు వస్తుందని శనివారం ఇష్టమని సరదాగా చెప్పారు. మనకు చదువు పెద్దగా ఇష్టం ఉండదు. అందుకే సెలవుల కోసం ఎదురుచూసే వాడిని అని ఆయన చెప్పారు. మీలాగే మీ కొడుకు కూడా శనివారం కోసం ఎదురు చూస్తారా అని అడిగితే.. ఈ ప్రశ్నకు నాని తన కొడుకు జున్ను గురించి మాట్లాడుతూ.. వాడు ఎప్పుడెప్పుడు స్కూల్ కి వెళ్దామని ఎదురు చూస్తూ ఉంటాడని అన్నారు.
Advertisement
Also read:
Also read:
మనం చిన్నప్పుడు కేవలం చదువుకునే వాళ్ళం. కానీ అందరూ ఇప్పుడు యాక్టివిటీస్ నేర్పిస్తున్నారు. తద్వారా స్కూల్ కి వెళ్లడానికి కూడా వాళ్ళు ఇష్టపడుతున్నారు. నా కొడుకు ఇంత చిన్న వయసులోనే పియానో నేర్చుకున్నాడు అని చెప్పారు. మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అని భవిష్యత్తులో నా సినిమాకు వాడు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తాడని నాని చేసిన కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!