Advertisement
వాము ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. వాముతో చాలా సమస్యలను నయం చేసుకోవచ్చు. వాములో విటమిన్స్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. నియాసిన్, థయామిన్, సోడియం వంటివి కూడా వాములో ఉంటాయి. పొటాషియం, క్యాల్షియం కూడా ఇందులో సమృద్ధిగా ఉంటుంది. వాములో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. వర్షాకాలంలో చాలా మందికి జలుబు చేస్తూ ఉంటుంది. దీని వలన ముక్కు మూసుకుపోతుంది. ఇలాంటి సమస్య ఉంటే వాముని తీసుకోవడం మంచిది. వామును వాడడం వలన ఆస్తమా కూడా నయమవుతుంది.
Advertisement
వాములో ఉండే యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు, యాంటీ మైక్రోబియన్ గుణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కీళ్ల నొప్పులు నయం చేయడానికి కూడా వాము చక్కగా హెల్ప్ చేస్తుంది. వామును తీసుకొని నలిపి కొంచెం బెల్లం కలిపి నమిలితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుకి మూడు నుంచి నాలుగు సార్లు ఇలా చేస్తే జలుబు తగ్గిపోతుంది.
Advertisement
Also read:
Also read:
ఉదర సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్లకి వాము దివ్య ఔషధంలా పనిచేస్తుంది. జీర్ణ రసాలని వాము విడుదల చేస్తుంది ఈ జీర్ణ సమస్యలను న్యాయం చేస్తుంది. ఇలా అనేక ప్రయోజనాలని వాముతో పొందవచ్చు. రోజుకు రెండు స్పూన్ల వాము తీసుకుంటే చాలా సమస్యలు తగ్గిపోతాయి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!