Advertisement
డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటుంటారు. హీరో ఎవరనేది కొంతవరకు హైప్ చేయగలదు కానీ రిలీజయ్యాక సినిమా కథ బాగుంటేనే, ఎమోషన్స్ ఎలివేషన్స్,కామెడీ ఎలిమెంట్స్ బాగుంటేనే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ అవుతుంది. స్టోరీస్ సెలక్షన్ హీరోని చూజ్ చేసుకోవడం నుంచి మూవీకి సంబంధించి అన్ని టెక్నికల్ ఫిల్డ్స్ లో పట్టు ఉండాలి. అందుకే సినిమాకి డైరెక్టర్ నే మెయిన్ గా చూస్తారు. మరి అలాంటి డైరెక్టర్లు కంటిన్యూస్ గా హిట్లు ఇస్తూ ఆడియన్స్ ను అలరించడం అంటే మామూలు విషయం కాదు. ఎంతో కృషి పట్టుదల ఉంటేనే అలాంటి విజయాలు సాధించవచ్చు. మన ఇండియన్ సినిమాల్లో అలాంటి డైరెక్టర్లు కొంతమంది ఉన్నారు.
Advertisement
వీరి సినీ కెరీర్లో ఒక్కటంటే ఒక్కటి ఫ్లాప్,యావరేజ్ మూవీ అసలు లేదు. తీసిన ప్రతి చిత్రం సూపర్ హిట్ గా నిలిచాయి. విరు సినిమాతో వస్తున్నారు అంటే అభిమానులకు ఎప్పటినుంచో అంచనాలు పెరుగుతూంటాయి. అలా అని వీరు మాత్రమే గొప్ప కాదు కొంత మంది తీసిన డైరెక్టర్ సినిమాలు కమర్షియల్ గా హిట్ కానప్పటికీ కొన్ని కల్టీ క్లాసిక్ గా మిగిలిపోయినవి ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు వీరు తీసిన సినిమాలు హిట్స్ తప్ప ఫ్లాప్ అసలు కాలేదు.. మరి ఆ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం..
ఎస్ ఎస్ రాజమౌళి :
ఆర్ ఆర్ ఆర్ సినిమా వరకు మొత్తం పన్నెండు సినిమాలు డైరెక్షన్ చేశారు రాజమౌళి. ఇందులో అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యాయి.
Advertisement
అట్లీ :
తక్కువ సినిమాలు చేసిన ఎక్కువ పాపులారిటీ సంపాదించుకున్న డైరెక్టర్ ఎవరంటే అట్లీ. ఆయన తీసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయింది.
లోకేష్ కనకరాజు :
నగరం, ఖైదీ, మాస్టర్ ఇలా వరుస సినిమాలతో హిట్ అందుకున్నారు కనకరాజు. ఈయన తీసిన సినిమాల్లో ఇప్పటికీ ఒక్క ఫ్లాప్ లేదు.
ప్రశాంత్ నీల్ :
కే జి ఎఫ్ సినిమా తో ప్రశాంత్ నీల్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. ఉగ్రం మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆయన కెరీర్లో ఒక ఫ్లాప్ లేదు.
వెట్రిమారన్ :
ఆయన ఇప్పటి వరకు ఐదు సినిమాలు తీశారు. అన్ని సూపర్ హిట్ సినిమాలే. ఇందులో నాలుగు సినిమాలు ధనుష్ తోనే తీశారు.
రాజకుమార్ హిరని :
సినిమా లో మెసేజ్ అండ్ ఎమోషన్స్ ని ఎక్కువగా చూపించడంలో దిట్ట. ఈ డైరెక్టర్ ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశారు. అన్ని బ్లాక్ బస్టర్ హిట్.
ALSO READ:
ఉత్తమ్ సింగ్, సూర్యనారాయణ టైటిల్, పోకిరిగా ఎలా మారింది? దాని వెనుకున్న స్టోరీ ఇదే.