Advertisement
ఐటి దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ని రేపు శంకుస్థాపన చేయనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓ రవికుమార్ తో చర్చలు జరిపారు. న్యూ జెర్సీలో ఐదవ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా కొత్త కంపెనీ విస్తరణ ప్రణాళికను ముందుగానే వెల్లడించింది. హైదరాబాద్ లో పది లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ ని పెట్టబోతున్నారు. అదనంగా 15000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి అని ప్రకటించింది.
Advertisement
Advertisement
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ డిజిటల్ ఇంజనీరింగ్ క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతతో కొత్త క్యాంపస్ పై ఫోకస్ పెట్టారు. కొరియా పర్యటన ముగించుకుని 14వ తేదీన ఉదయం ముఖ్యమంత్రి హైదరాబాద్ చేరుకోబోతున్నారు. అదే రోజు కాగ్నిజెంట్ కంపెనీ శంకుస్థాపన లో పాల్గొంటారు. కాగ్నిజెంట్ సీఈవో కూడా హాజరవుతారు. 1994 లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.
Also read:
హైదరాబాదులో 2002 నుంచి కార్యకలాపాలని మొదలుపెట్టారు. ఐటి కారిడార్ లోని వివిధ ప్రాంతాల్లో ఐదు క్యాంపస్లు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాదులో 57,000 మంది ఉద్యోగులు ఉన్నారు ఐటీ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న రెండవ సంస్థగా కాగ్నిజెంట్ కి పేరు ఉంది. 34 వివిధ విద్యాసంస్థల నుంచి 7,500 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలు ఇచ్చింది. గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి 7725 కోట్ల ఐటీ ఎగుమతుల్ని నమోదు చేసింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!