Advertisement
ఏపీలో విశాఖ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు టీడీపీ దూరంగా ఉండాలని అనుకుంటోంది. టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు విశాఖ నేతలతో చర్చించాక చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజులుగా పోటీలు నిలిపేందుకు ఆయన సమాలోచనలు చేశారు. ఆయనతో పాటుగా ఉప ఎన్నికల్లో పోటీ చేయాలా లేదా అనే దాని గురించి కూటమి పార్టీలు తర్జన భర్జన పడ్డాయి.
Advertisement
సరైన బలం లేకపోవడంతో చివరికి పోటీ నుండి తప్పుకోవాలని, వైసీపీకి మెజారిటీ సభ్యుల మద్దతు ఉంది. దీంతో పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్వతంత్ర అభ్యర్థి షేక్ షఫీ పోటీలో ఉన్నారు. ఒకవేళ కనుక స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ని ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కాబోతోంది, మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు పూర్తయింది స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారా..? ఉపసంహరించకపోయినా బొత్స విజయం కచ్చితంలానే ఉంది.
Advertisement
Also read:
విశాఖ స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఎంపీటీసీలు, జడ్పిటిసిలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మొత్తం 838 ఓట్లు ఉన్నాయి 636 మంది ఎంపీటీసీలు, 36 జడ్పిటిసిలు, 97 మంది కార్పొరేటర్లు 53 మంది కౌన్సిలర్లు అలాగే 16 మంది ఎక్స్ అఫీషియల్ సభ్యులుగా ఉన్నారు. ఇంకో ముగ్గురు వైసీపీ ఎక్స్ అఫీషియో కింద దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీకి 200 కి పైగా ఓట్లు ఉండగా వైసీపీకి 543 పైగా ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది. ఇరు పార్టీల మధ్య 400 మంది తేడా ఉంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!