Advertisement
వయసుకి, చదువుకి సంబంధమే లేదు. చాలామంది నా వయసు అయిపోయింది చదువుకోవాలనుకున్న ఇప్పుడు ఏం చదువుకుంటాను అని అనుకుంటారు. కానీ నిజానికి వయసుకి చదువుకి అసలు సంబంధం లేదు. 77 ఏళ్ల వయసులో ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ సాధించి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ వ్యక్తి చదువుపై తనకున్న ఆసక్తితో డిగ్రీ పట్టాను అందుకున్నారు. ఏపీలోని గుడివాడకు చెందిన లక్ష్మీనరసింహ శాస్త్రి ఇంజనీర్ గా తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాల్లో పని చేశారు. త్రిబుల్ ఐటీ హైదరాబాద్లో కార్యనిర్వాహక ఇంజనీరింగ్ గా రిటైర్ అయ్యారు.
Advertisement
ఆ తర్వాత కూడా అక్కడే ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ఒక వైపు పని చేస్తూ ఇంకోపక్క ఎమ్మెస్ పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. పరిశోధన పత్రాన్ని సమర్పించి ఈ ఏడాది జూలైలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. ఎప్పుడు మాస్టర్స్ పూర్తి చేస్తానని ఊహించలేదని శాస్త్రి వెల్లడించారు. క్యాంపస్లో విద్యార్థులు మధ్య ఉండడం తనకి ఆసక్తిని కలిగించిందని వారి మధ్య తిరుగుతూ ఉండడం వలన తరగతి గది వైపు అడుగులు పడ్డాయని అన్నారు.
Advertisement
Also read:
నేను నా థియరీ పేపర్లు అన్నిటిని రెగ్యులర్ విద్యార్థులతో పూర్తి చేసినప్పటికీ థీసిస్ పూర్తి చేయడానికి కొంచెం కష్టపడ్డానని అన్నారు. డేటా స్వీకరణ కోసం విజయవాడకు కనీసం 15 నుండి 20 సార్లు విజయవాడకు వెళ్లాల్సి వచ్చింది అని అన్నారు అలాగే నది తీరాలపై రెండు వేల రీడింగ్ లు చేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు. ఏది ఏమైనా ఎంత కష్టపడినా అనుకున్నది సాధించారు, నిజంగా శాస్త్రిగారూ శభాష్. ఈయనని ఆదర్శంగా తీసుకుంటే చదువుకోవాలని అనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చదువుకోగలుగుతారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!