Advertisement
హైదరాబాద్ మెట్రోలో ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా హ్యాపీగా ప్రయాణం చేయాలంటే మెట్రో మంచి ఆప్షన్. మెట్రోలో ప్రయాణం చేయడం వలన సమయం ఆదా అవుతుంది. అయితే ఇప్పుడు మెట్రోలో ప్రయాణం చేసే వాళ్ళకి బ్యాడ్ న్యూస్. చాలామంది ప్రయాణికులు ఇంటి దగ్గర నుంచి సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ దగ్గరికి వ్యక్తిగత వాహనాల్లో వస్తూ ఉంటారు. వారి వాహనాలని మెట్రో పార్కింగ్ ఏరియాలో వదిలేసి మెట్రోలో ప్రయాణం చేసి మళ్లీ తిరిగి వాహనం తీసుకుని ఇంటికి వెళ్తుంటారు.
Advertisement
చాలా వరకు ప్రయాణికులు ఉచితంగానే వాహనాలను పార్కింగ్ చేసి మెట్రోలో వెళ్తారు. ఎల్ అండ్ టి హైదరాబాద్ మెట్రో నాగోల్ మెట్రో స్టేషన్ లో ఉచిత పార్కింగ్ సదుపాయం తీసేసింది. నాగోల్ మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో మెట్రో ప్రీపెయిడ్ పార్కింగ్ బోర్డు పెట్టారు ఆగస్టు 14వ తేదీ నుంచి అంటే ఈరోజు నుండి పార్కింగ్ చార్జీలు వసూలు చేస్తున్నారు. ఇక్కడ బైకుల్ని రెండు గంటలు పార్కింగ్ చేస్తే పది రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఎనిమిది గంటల పాటు పార్కింగ్ చేయాలంటే 25 రూపాయలు చెల్లించాలి. 12 గంటల వరకు బైక్ లని పార్క్ చేయాలంటే 40 రూపాయలు కట్టాలి.
Advertisement
Also read:
Also read:
హైటెక్ సిటీ ఏరియాలో ఉద్యోగం చేసే ఓ వ్యక్తి నాగోల్ స్టేషన్లో బైక్ పార్కింగ్ చేయడానికి రోజు 40 రూపాయలు చెల్లించుకోవాలి. అదే కారు విషయానికి వస్తే రెండు గంటల పార్కింగ్ కి 30 రూపాయలు, ఎనిమిది గంటలు అయితే 75, 12 గంటలు అయితే 120 చెల్లించాలి. అదనంగా ఒక్కో గంటకు ఐదు రూపాయలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 40 శాతం డిస్కౌంట్ తో పార్కింగ్ చేసుకునేలా మంత్లీ పాసులు కూడా ఇస్తున్నారు. ఇది వరకు ఉచితంగా ఇక్కడ పార్కింగ్ ఉంది. కానీ ఇప్పటినుండి మాత్రం ఇక్కడ పార్కింగ్ చేయాలంటే డబ్బులు చెల్లించాల్సిందే.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!