Advertisement
తెలంగాణకి హైదరాబాద్ వాతావరణం కేంద్రం అధికారులు జారీ చేశారు. ఇంకో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాయలసీమ మీదుగా విస్తరించి ఉందని ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మీదుగా ఆగ్నేయ అరేబియా సముద్రాన్ని ఆనుకుని కేరళ తీరం వెంబడి వ్యాపించిందని వాతావరణ అధికారులు తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పలు జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Advertisement
ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతోపాటు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణశాఖ సూచించింది. రైతులు, కూలీలు, చెట్ల కింద, కరెంట్ పోల్స్, టవర్స్ దగ్గర్లో, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని అన్నారు.
ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవచ్చని అన్నారు.
Advertisement
Also read:
మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు తెలిపారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, దోమలగూడ, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి, షాపూర్ నగర్, జూబ్లీహిల్స్, నాంపల్లి, కోఠి, తిరుమలగిరి, ప్యాట్నీ, బేగంపేట, చిలకలగూడ, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్ పేట, సనత్ నగర్, ముషీరాబాద్, జీడీమెట్ల, ఆల్విన్ కాలనీ, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్, ఖైరతాబాద్, మారేడ్పల్లి, మేడ్చల్, దుండిగల్, చైతన్యపురి, ఎల్బీనగర్, వనస్థలిపురం, గండిమైసమ్మ, మలక్ పేట లో భారీ వర్షం గురువారం కురిసింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!