Advertisement
తల్లితండ్రులు పిల్లల పై కొంత ఆశ పెట్టుకుంటారు. అదే వారికి ఒక్క కూతురు లేదా కొడుకు మాత్రమే ఉంటే ఆశలు మరింత ఎక్కువగా ఉంటాయి. దాంతో పాటుగా పిల్లలు ఏది అడిగినా తల్లిదండ్రులు వెనకాడరు. అదేవిధంగా ఒక దంపతులకు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు, అయితే తను ఎన్ని ఖర్చులు పెడుతున్నా వెనకాడకుండా ఖర్చు పెట్టారు. కాకపోతే ఆ కొడుకు చెడు వ్యసనాన్ని అలవాటు చేసుకుని తల్లిదండ్రుల ప్రాణాలను తీశాడు.
Advertisement
ఈ ఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది, పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారం నంద్యాల జిల్లాలో వెలుగోడు మండలం, అబ్దుల్లాపురం గ్రామానికి చెందిన ఉదారు మహేశ్వర్ రెడ్డి మరియు ప్రశాంతి దంపతులకు నిఖిల్ రెడ్డి అనే ఒక కొడుకు ఉన్నాడు. వీరు వ్యవసాయం చేస్తూ జీవనాన్ని సాగిస్తారు. అయితే ఒక్కగానొక్క కొడుకు ఉండడం వల్ల మంచి చదువును అందించాలని చదువు కోసం బెంగుళూరు పంపించారు. అయితే అక్కడ చదువు పై ధ్యాస పెట్టకుండా నిఖిల్ రెడ్డి బెట్టింగ్ల పై శ్రద్ధ చూపాడు.
Advertisement
Also read:
దాంతో ఆన్లైన్ బెట్టింగ్ లో భారీ డబ్బులు కోల్పోయి 2.40 కోట్ల వరకు అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు నిఖిల్ రెడ్డి తల్లిదండ్రులు 10 ఎకరాల భూమి, ఇల్లు, వ్యవసాయ కల్లం అన్ని విక్రయించారు. అయినా సరే అప్పులు పూర్తిగా తీరలేదు. దాంతో మిగిలిన అప్పు తీర్చాలని నిఖిల్ రెడ్డి తల్లిదండ్రుల వద్దకు అప్పు ఇచ్చినవారు రావడంతో వారు చాలా బాధపడ్డారు. దాంతో వీరిద్దరూ తమ పొలం సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పరువు పోతుందని ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవాలనే దారుణ నిర్ణయం తీసుకున్నారు అని పోలీసులు చెప్తున్నారు. ఈ విషాద ఘటన జరిగిన తర్వాత కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించడం జరిగింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!