Advertisement
భార్యాభర్తల బంధం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ బంధం ఎంతో గొప్పది. దంపతుల మధ్య గొడవలు రావడం సహజం, అప్పుడప్పుడు గొడవలు వస్తూ ఉంటాయి సర్దుకుంటూ వెళ్లిపోవాలి. కొంతమంది చిన్న విషయాన్ని కూడా పెద్దది చేస్తూ విషాదంగా మార్చుకుంటారు. కొన్ని కుటుంబాల విషయంలో కూడా కొన్ని చెడు వ్యసనాలు చిచ్చు పెడుతూ ఉంటాయి. తాజాగా సూర్యాపేట జిల్లాలో బుధవారం ఒక విషాదం చోటుచేసుకుంది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండల కేంద్రానికి చెందిన దాసోజు బ్రహ్మచారి సరిత దంపతులు నివాసం ఉంటున్నారు.
Advertisement
కొద్ది రోజులుగా సూర్యాపేటలోని శ్రీరామ్ నగర్ లో వీళ్లు ఉంటున్నారు. బ్రహ్మచారి డోర్ పాలిష్ పనులు చేస్తూ ఉంటారు. సరిత ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయులగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. 2014లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయిన చాలా కాలం చాలా అంతా బాగుంది. ఇటీవల కొద్ది రోజుల నుంచి సరిత బ్రహ్మచారి మధ్య గొడవలు వస్తున్నాయి.
Advertisement
Also read:
అతను మద్యానికి అలవాటు పట్టాడు. రోజూ తాగి వచ్చి ఆమెతో గొడవ పడడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం మళ్లీ గొడవపడ్డాడు. ఆవేశానికి లోనై ఇంట్లోని వైర్ ను సరిత మెడకి చుట్టి బలంగా లాగేస్తాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది, ఈ ఘటనపై సమాచారం అందుకున్న సరిత కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకున్నారు ఆమె మృతదేహాన్ని చూసి విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!