Advertisement
ఆల్కహాల్ వలన కాలేయం దెబ్బతింటుంది. ఆల్కహాల్ కంటే కాలేయాన్ని దెబ్బతీసే కొన్ని ఆహార పదార్దాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆల్కహాల్ కంటే కొన్ని ఆహార పదార్థాలు లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటివి లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అలాగే వివిధ రకాల సమస్యలను కలిగిస్తాయి. సోడా, క్యాండీ వంటి అధిక చక్కెర కలిగిన ఆహార పదార్థాలు కూడా కాలేయ వ్యాధికి దారి తీస్తాయి. ఎక్కువగా సోడియం ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం వలన కాలేయం పాడవుతుంది. ఫాస్ట్ ఫుడ్ తదితర ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటే కూడా కాలేయ ఆరోగ్యం దెబ్బతింటుంది.
Advertisement
Advertisement
ఇవే కాకుండా ప్రాసెస్ చేసిన ఎర్రటి మాంసంలోనే కొవ్వు, కాలేయ వ్యాధికి దారి తీస్తాయి. కాబట్టి అటువంటి ఆహార పదార్థాలకు కూడా దూరంగా ఉండాలి. చాలామంది ఈరోజుల్లో లివర్ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. అటువంటి సమస్యలు కలగకుండా ఉండాలంటే డైట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
Also read:
ఎటువంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు అనేది చూశారు కదా కాబట్టి ఈసారి ఇటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి. అప్పుడు కాలేయ సంబంధిత సమస్యలు కలుగకుండా ఉంటాయి. ఆహారం విషయంలో ఈ మార్పులు చేసినట్లయితే లివర్ పాడవకుండా ఉంటుంది లేదంటే లివర్ సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం చూడండి!