Advertisement
చియాన్ విక్రమ్ నటించిన తంగలాన్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకున్న విషయం మనకి తెలుసు. తెలుగులో సినిమాలకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు చక్కటి వినూత్నమైన కాన్సెప్ట్ తో ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. వైవిధ్యమైన సినిమాలు వస్తే తెలుగు ఆడియెన్స్ ఆదరిస్తారని మరోసారి రుజువైంది. సినిమా రిలీజ్ కి ముందు భారీగా ప్రమోషన్స్ కూడా జరిపారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా ఈవెంట్ కూడా జరిపారు. కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలలో కూడా విక్రమ్ పాల్గొన్నారు. మూవీ రిలీజ్ తర్వాత విక్రమ్ ప్రధాన నగరాలు అన్నిటిని కవర్ చేస్తున్నారు.
Advertisement
స్కూల్స్, కాలేజీలు థియేటర్లు అంటూ తన సినిమాకి కావాల్సిన ప్రచారాన్ని స్వయంగా చేస్తున్నారు. ఇది కూడా సినిమాకి బాగా కలిసి వచ్చింది. సొంతం చేసుకున్నారు. సినిమా వసూళ్లు పెరగడానికి కూడా ఇదే కారణం. ఈ సినిమాతో పాటు ఓ రెండు తెలుగు సినిమాలు రిలీజ్ అయిన విషయం మనకి తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన పక్కా కమర్షియల్ చిత్రాలు ఇవి.
Advertisement
Also read:
రిలీజ్ అయిన రెండు సినిమాలు కూడా మంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోలేదు. రిజల్ట్ పక్కన పెడితే హీరోలు ఇద్దరు ప్రచారం సరిగ్గా నిర్వహించలేదని టాక్ రిలీజ్ కి ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్, కొన్ని వీడియోలు మినహాయించి సినిమా గురించి వ్యక్తిగతంగా జనాల్లోకి తీసుకెళ్లలేదు. ఇది సినిమాలపై ప్రభావం చూపించింది. ఒకవేళ కనుక ఆ రెండు తెలుగు సినిమాల హీరోలు కూడా ఇలాగే ప్రచారం చేసి ఉన్నట్లయితే సక్సెస్ అయి ఉండేవేమో.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!