Advertisement
మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ బ్రిటన్ టూర్ కి వెళ్తున్నారు. లండన్ లో చదువుకుంటున్న తన కూతురు దగ్గరకు వెళ్లడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో తన కూతురు దగ్గరకు వెళ్లడానికి సిద్ధమయ్యారు. CBI కోర్టును ఈ మేరకు అనుమతి కోరారు. పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. సీబీఐ అభిప్రాయాన్ని కోరింది. ఆ మేరకు నిర్ణయం తీసుకోబోతున్నారు. లండన్ లో చదువుకుంటున్న కూతురు దగ్గరకు వెళ్లడానికి సిద్ధమైన జగన్ హైదరాబాద్ సీబీఐ కోర్టును బెయిల్ షరతులు తాత్కాలికంగా సడలించాలని పిటిషన్ దాఖలు చేశారు.
Advertisement
Advertisement
ఇదివరకు సీఎం గా ఉండగా పలుమార్లు కోర్టు అనుమతి తీసుకుని విదేశాలకు వెళ్లారు. జగన్ ఇంకోసారి విపక్షంలో ఉంటూ ఇదే తరహాలో పిటిషన్ దాఖలు చేశారు, గతంలో అక్రమాస్తుల కేసులో బెయిల్ ఇచ్చిన సందర్భంగా విదేశాలకు అనుమతులు లేకుండా వెళ్లరాదని జగన్ కి కోర్టు షరతులు విధించింది. జగన్ ప్రతీసారి తప్పనిసరిగా సీబీఐ కోర్టు దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకో పక్క ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఇచ్చిన దౌత్య పాస్పోర్ట్ ను జగన్ నిన్న తిరిగి ఇచ్చేశారు.
Also read:
దీని స్థానంలో సాధారణ పాస్ పోర్టును ఆయన తీసుకున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న జగన్ గన్నవరం లో ఇలా పాస్ పోర్టును మార్చుకున్నారు. ఈ దౌత్య పాస్ పోర్టు ని కొంతమంది మంత్రులకు, ముఖ్యమంత్రులకు, పలువురు ప్రముఖులకు మాత్రమే ఇస్తారు వారు పదవీ అయిన తర్వాత వాటిని ఇచ్చేయాలి. మామూలు పాస్ పోర్ట్ ని తీసుకోవాలి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!