Advertisement
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో ఒక స్కామ్ బయటకి వచ్చింది. చంద్రబాబు నాయుడు సీఎం అయిన వెంటనే మొదట కుప్పంలోని జరిగిన అవినీతి మీద ఫోకస్ చేశారట. తర్వాత చిత్తూరు జడ్పీలో జరిగే స్కామ్ బయటకొచ్చింది ఇప్పుడు అదే చిత్తూరు నగరపాలక సంస్థలో జరిగిన భారీ గోల్ మాల్ వ్యవహారం బయటకి వచ్చింది. సుమారు 28 కోట్లకు పైగా గోల్ మాల్ జరిగిందని వార్తలు వస్తున్నాయి. 2023 డిసెంబర్ 11వ తేదీన చిత్తూరు నగర పలక సంస్థ కమిషనర్ అరుణ బాధ్యతలు స్వీకరించారు.
Advertisement
అప్పటి వైసీపీ మంత్రి అండదండలతో అరుణకు చిత్తూరు మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి అవకాశం వచ్చిందని ఆరోపణలు ఉన్నాయి. చిత్తూరు నగరపాలక సంస్థలో నగదు చెల్లింపులు, రాబడిని, జమకు సంబంధించిన క్యాష్ బుక్ నిర్వహణ గురించి అధికారులు అసలు పట్టించుకోలేదు. అన్ని లెక్కలు గాలికి వదిలేసినట్లు తెలుస్తోంది.
Advertisement
Also read:
చిత్తూరు నగరపాలక సంస్థలో జరిగిన గోల్ మాల్ వ్యవహారంలో సక్రమంగా లెక్కలు చూపించకుంటే సంబంధిత అధికారుల మీద చర్యలు తీసుకుంటామని గోవిందప్ప అంటున్నారు. లక్షలు విలువైన వస్తువులు కొనుగోలు చేసిన వాటికి స్టాక్ రిజిస్టర్ లెక్కలు లేవని తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరపడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!