Advertisement
ఆచార చాణక్య ఎన్నో విషయాల గురించి చెప్పారు. చాణక్య చెప్పినట్లు చేయడం వలన జీవితం చాలా బాగుంటుంది. చాణక్య భార్యాభర్తల గురించి కూడా అనేక విషయాలు చెప్పారు. ఎన్నో మతాలవారు వివాహాన్ని పవిత్రంగా పరిగణిస్తారు. ఆడ, మగ ఇద్దరూ తమ బంధంలో నిజాయితీగా ఉండటమే కాదు ఓ చిన్న కుటుంబాన్ని కూడా కలిగి ఉన్నప్పుడే వారి జీవితం స్వర్గమవుతుందని చాణక్య అన్నారు. కొన్నిసార్లు పురుషులు వివాహం చేసుకున్నా ఇంకో మహిళతో సహవాసం కావాలనుకుంటారు. ఇది వివాహిత జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈ సమయంలో స్త్రీ తన భర్తను సరైన మార్గంలోకి తీసుకువస్తే కుటుంబం నాశనం అయిపోకుండా ఉంటుంది.
Advertisement
అయితే అసలు పురుషులు అలాంటి దారిలో వెళ్లడానికి కారణాలు ఏంటి అనేది చూద్దాం.. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని ఎర్లీ మ్యారేజ్ చెడగొడుతుంది. చిన్న వయసులో కెరియర్ పై దృష్టి సారించే వ్యక్తి వ్యక్తిగత కోరికలపై దృష్టి పెట్టి స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తాడు. ఆ వ్యక్తి తన భార్యపై ఆసక్తి చూపించకపోవచ్చు. వాస్తవానికి పురుషులు తమ కోరికలను బట్టి స్త్రీల పట్ల ఆకర్షితులు అవుతూ ఉంటారు. అలాగే వైవాహిక జీవితంలో మానసిక సంబంధంతో పాటు శారీరిక సంబంధం కూడా ముఖ్యం. పురుషుడు సహజంగానే మరో స్త్రీ సాంగత్యంలో పడిపోతాడని ఆచార్య చాణక్య అన్నారు.
Advertisement
Also read:
Also read:
భార్యాభర్తల మధ్య నమ్మకం చాలా ముఖ్యం నమ్మకం లేకపోతే కూడా మరొకరితో సంబంధం అని పెట్టుకుంటారు. ఇలా వైవాహిక జీవితాన్ని దెబ్బతీస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్న ప్రేమ బిడ్డ పుట్టిన తర్వాత కనబడకపోవచ్చు. ఆ సమయంలో భార్య తన భర్త పై తక్కువ శ్రద్ధ చూపిస్తుంది. భర్త కంటే భార్య బిడ్డకే ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఇలాంటివి జరుగుతాయి. చిన్న చిన్న విషయాలకే కొన్నిసార్లు భార్యాభర్తలు మనస్థాపానికి గురవుతారు కొంతమంది పురుషులైతే భాగస్వామిలో ఉండే తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. మంచిని అసలు గ్రహించరు ప్రేమ. ద్వేషమే పెరుగుతుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!