Advertisement
కోపంతో చాలామంది సఫర్ అవుతుంటారు. కోపం వలన వాళ్లతో పాటుగా వాళ్లతో ఉండే వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఆధునిక జీవితం ప్రతి ఒక్కరిలో అసహనాన్ని పెంచుతోంది. క్షణికావేశాన్ని కలిగేలా చేస్తోంది. కోపం విపరీతంగా వచ్చినప్పుడు ఒకటి నుంచి 100 వరకు అంకెలు లెక్క పెట్టాలి. దీంతో గుండె వేగం తగ్గిపోతుంది. ఆవేశం చల్లారుతుంది. కోపం ఎక్కువగా ఉంటే రోజు వ్యాయామం చేయడం మంచిది. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది భావోద్వేగాలపై నియంత్రణ పెరుగుతుంది.
Advertisement
అలాగే కోపం వస్తున్నప్పుడు చేతులు కాళ్ళను రిలాక్స్ అయ్యేలా కాస్త స్ట్రెచ్ చేస్తే వెంటనే మీకు ఉపశమనం లభిస్తుంది. మీకు కోపం ఎక్కువగా వచ్చినప్పుడు కాసేపు పాటలు వినండి. పాటలు వినడం వలన ఆవేశం తగ్గుతుంది. ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఫీలింగ్స్ వస్తాయి.
Advertisement
Also read:
మనోభావాలకు అక్షర రూపం ఇవ్వండి. అప్పుడు కోపం చల్లారుతుంది. కోపాన్ని పెంచే పరిస్థితుల గురించి మనసుకు దగ్గరైన వాళ్ళతో మాట్లాడితే ఉపశమనం కలుగుతుంది. అలాగే కష్టాల్లో ఉన్న వారికే సహాయం చేయడం ద్వారా మనసులో సానుకూల వాతావరణం ఏర్పడి ఫీలింగ్స్ కంట్రోల్ లో ఉంటాయి. ఇలా చేశారంటే కచ్చితంగా కోపం తగ్గుతుంది. కావాలంటే ఈసారి ట్రై చేయండి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!