Advertisement
చిన్నపిల్లలకు కూడా కలలు వస్తాయా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే చిన్నపిల్లలకి కలలు వస్తాయా..? కలలో వాళ్ళు ఏడుస్తూ ఉంటారా..? భయపడుతూ ఉంటారా అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. చిన్నపిల్లలు నిద్రలో లేచి ఏడుస్తూ కనపడితే కచ్చితంగా వాళ్ళు భయపడ్డారని తల్లిదండ్రులు భయపడతారు. ఏదైనా పీడకల వచ్చి ఏడుస్తున్నారేమో అనే సందేహం కలుగుతుంది. అయితే అసలు ఏ వయసు నుండి కలలు వస్తాయి..? చిన్న పిల్లలకు కూడా కలలు వస్తాయా అనేది తెలుసుకుందాం.
Advertisement
చిన్నపిల్లలకి కలలు కనే సామర్థ్యం ఉండదు. క్లిష్టమైన పరిస్థితుల్ని సృష్టించే శక్తి వాళ్ళ మెదడుకు ఉండదు. కనుక వాళ్లకు కలలు రావు. మనకు వచ్చే కలలు మన ఆలోచన నుంచి వస్తాయి. మనం రోజు ఎదుర్కొనే ఒత్తిడి, సమస్యల ప్రభావం కారణంగా వస్తూ ఉంటాయి. మనిషి వ్యక్తిత్వం బట్టి వాళ్ళకి వచ్చే కలలు మారుతూ ఉంటాయి. చిన్నపిల్లలకు ఇంకా సొంత వ్యక్తిత్వం ఏర్పడదు. కాబట్టి వాళ్లకు కలలు రావు. పిల్లలు నిద్ర మధ్యలో లేచి ఏడవడానికి చాలా కారణాలు ఉంటాయి.
Advertisement
Also read:
నెలల వయసు నుంచి సంవత్సరం వయసు ఉన్న పిల్లలు ఆకలి వల్ల, డైపర్ తడవడం వలన, బాగా అలసిపోవడం వలన ఏడుస్తూ ఉంటారు. లేదంటే సౌకర్యంగా ఉంటే కూడా ఏడుస్తారు. ఒకసారి మెలుకువ వచ్చాక మళ్ళీ నిద్ర పోవడం వారికి తెలియదు అందువల్ల కూడా వాళ్ళు ఏడుస్తారు. మూడు లేదా నాలుగు ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు కలలు రావు. వాళ్ళను భయపెట్టే కలలు అస్సలు రావు. ఎందుకంటే వాళ్లను భయపెట్టే వెంటో వాళ్ళకి తెలియదు. కాబట్టి చీకటి, దెయ్యం, ప్రమాదం, జంతువులు ఇలాంటివి ఏమీ వాళ్లకి తెలియదు కాబట్టి వాళ్లకి భయంకరమైన కలలు అసలు రావు సో భయపడక్కర్లేదు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!