Advertisement
భారత క్రికెట్ బోర్డులో హవా నడిపిస్తున్నాడు జైషా. సెక్రెటరీ పోస్ట్ లో ఉన్న ఆయన ఏం చెప్తే అదే జారుతోంది. చైర్మన్ గా ఎవరు ఉన్నా అతని మాటకి ఎదురు ఉండట్లేదు. బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ గా పేరు తెచ్చుకున్నారు. మన దేశ క్రికెట్ వ్యవహారాలన్నీ జాగ్రత్తగా చూసుకుంటున్నారు. షా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కు చైర్మన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. 16 మంది సభ్యులు 15 మంది ఆయనకే సపోర్ట్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
Advertisement
ఆగస్టు 27న ఐసీసీ చైర్మన్ పోస్ట్ అధికారిక నామినేషన్లు దరఖాస్తులకు చివరి తేదీ. ఈ మేరకు షా నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన ఐసీసీకి వెళ్లిపోయే సూచనలు బలంగా కనపడటంతో బీసీసీఐ లో ఆ పోస్టులోకి వచ్చేది ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది. అయితే ఈ రేసులో నలుగురు పేర్లు వినబడుతున్నాయి. మొదటి పేరు రోహన్ జైట్లీ. కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కొడుకు రోహన్ జైట్లీ. వృత్తిరీత్య న్యాయవాది. క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ గా తక్కువ టైంలోనే పేరు తెచ్చుకున్నారు.
Advertisement
Also read:
రోహన్ జైట్లీతో పాటుగా రాజీవ్ శుక్ల పేరు కూడా వినపడుతోంది. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న ఆయన సెక్రటరీ పోస్ట్ లోకి వస్తే ఏడాది పాటు కంటిన్యూ చేయొచ్చు. అలాగే ఈ రేసులో ఆశిష్ షెలార్ పేరు కూడా వినపడుతోంది. మహారాష్ట్రకు చెందిన ఈ బీజేపీ లీడర్ బీసీసీఐ కోశాధికారిగా ఉన్నారు. నాలుగవ పేరు అరుణ్ ధమాల్. బోర్డు పెద్దలతో ఈయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఐపీఎల్ చైర్మన్ గా సక్సెస్ అవ్వడం ఆయనకు కలిసి వచ్చే అంశం. రోహన్ జైట్లీ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. ఏం జరుగుతుందనేది పెద్దల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇది చూడండి!