Advertisement
TDP తలుపులు తెరిచిందా..? వైసీపీని పూర్తిగా ఖాళీ చేయించాలని చూస్తోందా..?ముఖ్యంగా మున్సిపాలిటీలు నగరపాలక సంస్థలపై దృష్టి పెట్టిందా అంటే అవునని చెప్పచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి తప్ప అన్ని కార్పొరేషన్లు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. వైసీపీ స్వీప్ చేసినంత పని చేసింది. అప్పట్లో వైసీపీ హవా చూసి చంద్రబాబు ప్రాదేశిక ఎన్నికలని బహిష్కరించారు. వైసీపీ ఎన్నికల్లో విధ్వంసం సృష్టించిందని బలవంతంగా గెలుచుకుందని ఆరోపించి స్థానిక ఎన్నికలకు దూరమయ్యారు.
Advertisement
ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. టీడీపీ కూటమి ఘనవిజయాన్ని అందుకుంది 164 చోట్ల గెలుపొందింది. 2019 ఎన్నికల్లో 151 సెట్లలో ఘనవిజయాన్ని సాధించిన వైసీపీ 11 సీట్లకే పరిమితం అయిపోయింది. తాజాగా ఏలూరు నగరం మున్సిపల్ కార్పొరేషన్ లో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. మేయర్ షేక్ నూర్జహాన్ వైసీపీకి రాజీనామా చేసేసారు. రేపు ఆమె తన భర్త పెదబాబుతో కలిసి టిడిపిలో చేరిపోతున్నారు.
Advertisement
Also read:
వారితో పాటుగా ఏలూరు కార్పొరేషన్ లో కార్పొరేటర్స్ టీడీపీ బాట పట్టారు. చాలా మున్సిపాలిటీలు టీడీపీ లో చేరాయి. పుంగనూరు, హిందూపురం, మాచర్ల ఇలా ప్రధాన మున్సిపాలిటీలు ఖాళీ అయిపోయాయి. ప్రతి మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు అందరూ టీడీపీ వైపు చూస్తున్నారు నాడు. ఎన్నికల్లో టీడీపీ కేవలం తాడిపత్రి నియోజకవర్గంలో మాత్రమే విజయాన్ని సాధించింది. ఇప్పుడు వైసీపీ ఖాతాలో ఉన్న మున్సిపాలిటీలు టీడీపీలో చేరడం విశేషం.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!