Advertisement
ప్రస్తుతం తెలంగాణలో వినబడుతున్న పేరు హైడ్రా. మెట్రో సిటీ హైదరాబాద్ లో ఉంటున్న పలువురు సినీ వ్యాపార రాజకీయ ప్రముఖులు చిర్రెత్తిపోతున్నారు. తెలిసో తెలియకో అక్రమము, సక్రమము ఎలాగోలా సొంత ఇంటి కాలనీ సహకారం చేసుకున్న కొందరు సామాన్యులు భయపడిపోతున్నారు. హైడ్రా సంపన్నుల నుంచి సామాన్యుల వరకు ఎవరిని విడిచిపెట్టలేదు. అక్రమ నిర్మాణం అని తెలిస్తే చాలు ఇంటిపైకి బుల్డోజర్లు వెళ్లిపోతున్నాయి ఇల్లు, ఫామ్ హౌస్, వ్యాపార సముదాయాలతో పాటుగా రేకుల షెడ్లని కూడా వదిలిపెట్టలేదు. తాజాగా అక్కినేని నాగార్జున కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఈ పేరు ఎక్కువగా వినపడుతోంది. నిజాంల పాలన అంతమైన తర్వాత ఆ చెరువులు పార్కులు కాలక్రమేణా కనుమరుగయ్యాయి. నిజాముల భూముల్లో కూడా కొన్ని ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లాయి కొన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారు.
Advertisement
Advertisement
నిజాంల కాలం నాటి చెరువుల్ని పూడ్చివేసి పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినట్లు ప్రభుత్వం భావిస్తోంది. చెరువులు కాలువల కబ్జా కారణంగా అద్భుతమైన డ్రైనేజీ వ్యవస్థ కలిగిన హైదరాబాద్లో చినుకు పడితే భయపడే విధంగా మారిపోయింది అని అంతా అంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల నుంచి పుట్టింది ఈ హైడ్రా. వరదలు లోతట్టు ప్రాంతాలు మునగ రోడ్లు జలమయం అనేది భవిష్యత్తులో హైదరాబాద్ నగరంలో వినిపించకూడదని హైడ్రాను ఏర్పాటు చేశారు. వరద పరిస్థితులకి కారణమేంటని ఆరాధిస్తే చెరువుల కబ్జాలు, రోడ్ల ఆక్రమణల విషయాలు బయటపడ్డాయి. ఈ నిర్మాణాలను కూల్చివేతకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇందుకోసం ప్రత్యేకంగా హైడ్రా అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది.
Also read:
వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో వరద సమస్యను పరిష్కరించే పనిలో పడింది హైడ్రా. ఇప్పటివరకు నగరవ్యాప్తంగా 18 చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పలువురు విఐపి లతో పాటుగా రాజకీయ నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెందిన నిర్మాణాలు కూడా ఇందులో ఉన్నాయి. నెలరోజుల్లోనే ఏకంగా 43 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడినట్లు హైడ్రా ప్రకటించింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!