Advertisement
అక్కినేని నాగార్జున సినిమాలతో పాటుగా వ్యాపారాల్లో కూడా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఆయనను చూస్తే ఎంతోమంది స్టార్స్ తమ పెట్టుబడును వ్యాపారాల్లో పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. తమ్ముడికుంట ప్రాంతంలో ఓ చెరువుని ఆక్రమించి ఎన్ కన్వెన్షనల్ ను నాగార్జున నిర్మించారని ఎప్పటి నుంచో అభియోగాలు ఉన్నాయి. కొందరు ఈ అంశంపై కోర్టును కూడా ఆశ్రయించారు. కొన్ని కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు కూడా దీనిపై విపరీతంగా ఫిర్యాదులు అందాయి.
Advertisement
ఆక్రమంగా దీన్ని నాగర్జున నిర్మించారని.. కూల్చివేయాలని కొద్ది రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డికి ఒక ఫిర్యాదు అందింది. దీనిని పరిశీలించిన మంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు కూల్చేశారు. దీనిపై నాగార్జున హైకోర్టుని ఆశ్రయించారు. న్యాయస్థానం స్టే విధించినట్లు వార్తలు ఇచ్చారు. చెరువులోని పన్నెండు కుంటలు బఫర్ జోన్ లో రెండు ఎకరాలు 18 గుంటల్లో దీనిని నిర్మించారని రంగనాథ్ చెప్పారు.
Advertisement
Also read:
ఇంత జరిగినా సినీ పరిశ్రమ నుంచి నాగార్జునకి సపోర్ట్ ఎవరు ఇస్తున్నట్టు వ్యాఖ్యలు చేయలేదు. ప్రభుత్వంతో లేనిపోని తలనొప్పి ఎందుకని అంతా వెనకడుగు వేసి ఉండొచ్చు. అయితే బాలయ్య ఈ విషయంపై సీరియస్ గా మాట్లాడారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు సంబంధించిన పాత వీడియోని ఒకటి వైరల్ చేస్తున్నారు. పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై గతంలో ఎన్నో మీటింగ్స్ జరిగాయని.. తనని ఎవరూ పిలవలేదని ఇలాంటి వారంతా హైదరాబాద్లో భూములు పంచుకుంటారా అని బాలకృష్ణ సంచలన కామెంట్స్ ఆ వీడియోలో చేసారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!