Advertisement
అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అల్లు మెగా మధ్య నడుస్తున్న అంతర్గత పోరు నిన్న మొన్నటిదాకా సోషల్ మీడియా వరకు మాత్రమే పరిమితమైంది. ఇప్పుడు ఏకంగా ఇరుపక్షాలకు చెందిన పెద్దలు ఒకరిపై ఒకరి విమర్శలు చేసుకోవడం సంచలనంగా మారింది. అల్లు అర్జున్ మామయ్య చంద్రశేఖర్ రెడ్డి జరుగుతున్న ఈ గొడవలపై మాట్లాడుతూ పుష్ప సినిమా పై పవన్ కళ్యాణ్ అలా మాట్లాడటం సరికాదని అన్నారు.
Advertisement
అల్లు అర్జున్ మారుతి నగర్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ కి వచ్చి నా మనసుకు నచ్చితే ఎక్కడికైనా వస్తా అది మీ అందరికీ కూడా తెలుసు అని మాట్లాడారు. దీని మీద గొడవలు జరుగుతూనే ఉన్నాయి. జనసేన పార్టీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా దీనిపై స్పందించారు. అల్లుఅర్జున్ కి అభిమానులు ఉన్నారు అనడం ఇదే నేను మొదటిసారి వింటున్నాను. మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయనకి ఉన్నారు. ఆయన తన స్థాయిని మర్చిపోయి మాట్లాడుతున్నారని అన్నారు.
Advertisement
Also read:
Also read:
ఆయనకి ఏదో అభిమానులు ఉన్నట్లుగా ఊహల్లో తేలుతున్నాడని.. మొన్న నాకు ఇష్టం ఉంటేనే వస్తా లేదంటే రాను అన్నారు. అసలు నిన్ను ఎవడు పిలిచాడు..? నువ్వు నంద్యాలకు వెళ్లి నీ మిత్రుడిని ఓడించావు. మేము 21 స్థానాల్లో పోటీ చేస్తే 21 గెలిచాము. నువ్వు గత ఎన్నికల్లో మీ నాన్నని ఎంపీగా గెలిపించలేకపోయావు అంటూ స్పందించారు. ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఈ రేంజ్ కామెంట్స్ చేశాడంటే చిరంజీవి పవన్ కళ్యాణ్ వంటి వారు కూడా ఇదే ఆలోచనపై ఈ స్థాయిలో కోపంతో ఉన్నారని అంతా అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!