Advertisement
హైదరాబాద్లోని ఒక వస్త్ర దుకాణం ఓపెనింగ్ కి అక్కినేని నాగచైతన్య గెస్ట్ గా వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన చైతన్యకి షోరూం యాజమాన్యం భారీ స్వాగతం పలికింది. డప్పుతో నాగచైతన్యన్ని తీసుకొచ్చారు. చైతన్యను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు షాపింగ్ మాల్ ఓపెనింగ్ అనంతరం మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన పలు సమాధానాలు చెప్పారు. హైడ్రా ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడం పై రియాక్షన్ ఏంటని నాగచైతన్యని అడిగారు. దానికి ఆన్సర్ చెప్తూ.. దాని గురించి ఇప్పుడు ఎందుకండీ ఇప్పుడు వచ్చిన స్టోర్ ఓపెనింగ్ గురించి మాట్లాడదామని అన్నారు. అయినా దాని గురించి ఇప్పటికే నాన్న తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలిపారు.
Advertisement
ఇప్పటికి ఆ రియాక్షన్ చాలు దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం అని అన్నారు. తర్వాత శోభితతో పెళ్లి ఎప్పుడు ఎక్కడ అనే ప్రశ్న ఎదురయింది. శోభిత ధూళిపాళ్లతో మీ పెళ్లి గ్రాండ్గా చేసుకుంటారా లేదంటే సింపుల్ గా చేసుకుంటారా అని అడిగితే.. నాకు పెళ్లంటే నా మనసుకు దగ్గర వాళ్ళందరూ ఉండాలి. అది భారీగా చేసుకోవాలని ఏం కాదు. కానీ మన సంస్కృతి సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమని అన్నారు.
Advertisement
Also read:
వెడ్డింగ్ హైదరాబాద్లో ఉంటుందా ఎక్కడ ఉంటుందా అనేది త్వరలోనే చెప్తానని చైతన్య అన్నారు. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య శోభితతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఇద్దరూ కలిసి పలుమార్లు వెకేషన్ కి కూడా వెళ్లిన ఫోటోలను నెట్టింట వైరల్ అయ్యాయి. అది నిజమే అని వీళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!