Advertisement
పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా స్టార్ హీరోలు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లోకి వచ్చి పాపులర్ అయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు ఘన విజయాన్ని అందుకుని డిప్యూటీ సీఎం అయ్యారు. పవన్, అల్లు అర్జున్ మధ్య గత కొన్ని రోజుల నుంచి కూడా మాటలు యుద్ధం నడుస్తోంది. అల్లు అర్జున్ జనసేనకు మద్దతు ఇవ్వకుండా వైసీపీకి సపోర్ట్ చేయడం ఈ వివాదానికి తెరలేపింది. మెగా ఫాన్స్ అంతా బన్నీ వ్యవహారం పై మండిపడుతున్నారు.
Advertisement
సోషల్ మీడియా వేదికగా విమర్శలు కూడా చేస్తున్నారు. పవన్ కూడా ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఈరోజుల్లో హీరోలు అడవులను రక్షించడం పోయి స్మగ్లింగ్ అంటూ సినిమాలు తీస్తూ స్మగ్లర్లుగా మారుతున్నారని అన్నారు. దీనిపై అల్లు అర్జున్ అభిమానులు మండిపడుతున్నారు. పవన్ అన్నది అల్లు అర్జున్ అని తీవ్రంగా రెస్పాండ్ అవుతున్నారు. అల్లు అర్జున్ కూడా ఈ విషయాలపై రెస్పాండ్ అయ్యారు. ఓ సినిమా ఈవెంట్ కు హాజరై తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఇచ్చారు. తన ఫ్యాన్స్ అంటే తనకు ప్రాణం అని.. నచ్చింది చేస్తానని.. నచ్చిన చోటుకు వెళ్తానని కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఒకే ఈవెంట్ కు వెళ్లడం ఇప్పుడు అంతటా చర్చనీయం అయింది.
Advertisement
Also read:
వీళ్ళు ఇద్దరు వెళ్లేది ఎక్కడికంటే నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం మొదలయ్య 50 ఏళ్లు అవుతోంది. దీనిని పురస్కరించుకుని సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవాలు నిర్వహించబోతున్నారు. బాలయ్యను టాలీవుడ్ ఘనంగా సన్మానించబోతోంది. చిరంజీవి పవన్ కళ్యాణ్ లకు కూడా ఆహ్వానం అందింది. అల్లు అర్జున్ ని మా సభ్యులు ఆహ్వానించారు. బాలయ్య ఫ్యామిలీతో అల్లు అర్జున్ ఫ్యామిలీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మరి అక్కడ అందరూ సైలెంట్ గా ఉంటారా లేదంటే మాట్లాడుకుంటారా అనేది చూడాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!