Advertisement
ఏపీలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి షాకులు మీద షాకులు తగులుతున్నాయి. పలువురు నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ రావు షాక్ ఇచ్చారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు బాంబు పేల్చారు. తనతో పాటుగా వైసీపీ ఎంపీ బీద మస్తాన్ రావు కూడా రాజీనామా చేసేసారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక స్థానాల్లో ఒకటైన రేపల్లెకు ఇన్చార్జిగా ఉన్నా మోపిదేవి వెంకట రమణ రావు తప్పించి ఆస్థానంలో కొత్త అభ్యర్థి గణేష్ కు వైసీపీ అధినేత జగన్ సీటు ఇచ్చారు.
Advertisement
దీనిపై మోపిదేవి అప్పట్లోనే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మోపిదేవి వెంకటరమణ 2009 ఎన్నికల్లో రేపల్లె నుంచి కాంగ్రెస్ తరపున గెలిచారు. తర్వాత వైయస్సార్ మంత్రివర్గంలో పెట్టుబడులు, ఓడరేవులు, మౌలిక సదుపాయాల మంత్రిగా వ్యవహరించారు. వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో మోపిదేవి జైలు పాలయ్యారు. మంత్రి పదవిని కూడా పోగొట్టుకున్నారు.
Advertisement
Also read:
2014-19 ఎన్నికల్లో వైసీపీ నుంచి రేపల్లెలో బరిలోకి దిగి ఓడిపోయారు. తన వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మోపిదేవి మంత్రి పదవిని పోగొట్టుకున్నారని, జైలు పాలయ్యారని జగన్ 2019లో అతను ఓడిపోయినా మంత్రివర్గంలోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తర్వాత శాసనమండలి రద్దు చేయాలని నిర్ణయించుకున్నప్పుడు మోపిదేవి రాజ్యసభకు పంపారు. రాజీనామాకి బలమైన కారణాలు ఉన్నాయని అన్నీ బయటికి చెప్పలేనని ఆయన అన్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!