Advertisement
మెగా ఫ్యామిలీలో చీలిక వచ్చింది. ఇప్పటిదాకా మెగా కాంపౌండ్ వాల్ నుంచి పవన్ కళ్యాణ్ రామ్ చరణ్, వరుణ్ తేజ్ తదితరులు వచ్చారు. అల్లు అర్జున్, అల్లు శిరీష్ సైతం మెగా ఫ్యామిలీ గానే భావించారు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాల పుణ్యమా అంటూ మెగా కుటుంబం వేరు అల్లు కుటుంబం పేరు అయిపోయింది. ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ తన స్నేహితుడు శిల్పా రవి కిషోర్ రెడ్డికి సపోర్ట్ ఇచ్చాడు. ఆయన నంద్యాల నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కి తన ట్విట్టర్ ద్వారా మద్దతు ప్రకటించారు. అల్లు అరవింద్ పిఠాపురం వెళ్లి నేరుగా పవన్ కళ్యాణ్ ని కలిసి మద్దతు ప్రకటించారు.
Advertisement
కానీ అప్పటి నుంచి అభిమానుల మధ్య స్పష్టమైన చీలిక వచ్చింది. ఏపీలో జనసేన గెలుపుతో పతాక స్థాయికి చేరుకుంది. సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ దుష్ప్రచారం మొదలయ్యాయి. ఎవరికి వారు డైరెక్ట్ గా కామెంట్స్ చేసుకున్నా పరోక్ష వ్యాఖ్యలతో వాతావరణాన్ని వేడెక్కించేశారు. మెగా అభిమానులు అల్లు అర్జున్ అభిమానులు మధ్య గొడవలు జరుగుతున్నాయి అల్లు అర్జున్, తమ వాడిగా చూపే ప్రయత్నం చేస్తోంది. వైసీపీ ఈ వివాదాన్ని మీడియా కూడా హైలెట్ చేస్తోంది. అల్లు అర్జున్ వైసీపీ మనిషి అని చిత్రీకరించే ప్రయత్నం కూడా చేస్తుంది. వైసీపీ నేతలు కూడా అల్లు అర్జున్ తమ వాడిగా ప్రచారం చేసుకుంటున్నారు.
Advertisement
Also read:
చంద్రబాబు వెంట పవన్ నడిచినట్లే అల్లు అర్జున్ వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారని వైసీపీ అభిమానులు అంటున్నారు. మెగా కుటుంబం అల్లు కుటుంబం వేరని చెప్తున్నారు. అసలు అల్లు రామలింగయ్య లేకపోతే మెగా కుటుంబం ఎక్కడిది అని అడుగుతున్నారు. అల్లు కుటుంబం లేకపోతే మెగా కుటుంబంకి అవకాశాలు ఎక్కడవని ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ వివాదం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ముందు నుంచి కూడా జనసైనికులు అంటే వైసీపీకి పడదు. దీంతో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు ఈ విషయంలో ముందున్నారు. అందుకే మెగా కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!