Advertisement
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన చైర్మన్ గా జై షా ఎన్నికైన విషయం తెలిసిందే. ఏకగ్రీవంగా ఆయన ఎన్నికయ్యారు. BCCI సెక్రటరీగా ఉన్న జై షా ఈ డిసెంబర్లో ఐసీసీ చైర్మన్ గా పదవి చేపట్టబోతున్నారు. ప్రస్తుత ఐసీసీ చైర్మన్ పదవి కాలం నవంబర్ 30తో ముగుస్తుంది. ఐసీసీ చైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్ వేసేందుకు మంగళవారం ఆఖరి రోజు. అయితే జై షా నిలవడంతో ఇంకెవరు పోటీ చేయడానికి ముందుకు రాలేదు. జై షా ఎన్నిక ఏకగ్రీవమైన ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించారు. జగన్మోహన్ దాల్మియా, శరత్ పవార్, శ్రీనివాసన్. శశాంక్ మనోహర్లు జై షా కంటే ముందు భారత్ నుంచి ఐసీసీ చైర్మన్ గా ఎన్నికయ్యారు.
Advertisement
Advertisement
ఇండియా క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్ష పదవితో పాటు సెక్రెటరీ, వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ పోస్టులకు ఎలాంటి ఫిక్స్డ్ శాలరీలు నిర్ణయించలేదు. గౌరవ ర్యాంకులుగానే పరిగణిస్తారు. కాకపోతే బీసీసీఐకి సంబంధించిన పనులకు అలోవెన్స్ ఇస్తారు. విదేశాల్లో జరిగే మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు, క్రికెట్ పర్యటనలకు వెళ్ళినప్పుడు డైలీ అలోవెన్స్ 84000 బోర్డు చెల్లించేది.
Also read:
భారత్ లో జరిగే సమావేశాలకు 40 వేలు ఇస్తుంది. వీటితోపాటు విమాన ఖర్చులను భరిస్తుంది. బిజినెస్ క్లాస్ టికెట్స్ ని కేటాయిస్తుంది. మీటింగ్స్ కాకుండా ఇతర క్రికెట్ అసోసియేషన్స్ కు వెళ్ళినప్పుడు 30000 డైలీ అలోవేన్స్ ఇచ్చేవారు. బీసీసీఐ లాగే ఐసీసీ కూడా ఎలాంటి ఫిక్స్డ్ శాలరీను ఇవ్వట్లేదు. కాకపోతే వారికి వివిధ అలోవెన్స్ తో పాటు బెనిఫిట్స్ రియంబర్స్మెంట్ సదుపాయాలని ఇస్తుంది.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!