Advertisement
బాలీవుడ్ నటి కేసు పై పేర్ని నాని సంచలన ఆరోపణలు చేశారు. కేసు అంతా కూడా డ్రామా అని కొట్టిపారేశారు. కొంతమంది ఐపీఎస్ లను టార్గెట్ చేశారని..అందుకే నటి కేసును తెరపైకి తీసుకు వచ్చారని అన్నారు. కొంతమంది అధికారులపై కేసులు పెట్టడానికి కొత్త డ్రామా చేస్తున్నారని అన్నారు. ఆ కేసులోని నిందితుడితో తమకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మహిళని అడ్డం పెట్టుకుని నీచానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.
Advertisement
ఆ నటిపై చాలా రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని.. అలాంటి ఆమెను అడ్డం పెట్టుకుని తమ పార్టీపై బురద జల్లుతున్నారని అన్నారు. ముంబై నటి కేసు విషయంలో వైసీపీ నాయకులు పై విమర్శలు వస్తున్నాయి. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ముంబై నటి తో వైసీపీ నాయకుడు విద్యాసాగర్ రావుకి పరిచయం ఏర్పడింది.
Advertisement
Also read:
Also read:
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలని ఆమెను అన్నారు. దీంతో విద్యాసాగర్ రావు ముఖం చాటేసారు. అంతేకాదు నటి వేధింపులకు గురి చేశారు. ఓ వైసీపీ నాయకుడు అండతో ఏపీలో ఆమెపై ఆక్రమంగా కేసులు నమోదు చేయించారు. అధికారం మారడంతో ఇది వెలుగులోకి వచ్చింది అని అంతా అంటున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!