Advertisement
సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా కూడా ఫాన్స్ మారిపోరు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఫ్యాన్స్ ఇష్టపడతారు. అయితే అభిమానిని గుర్తుపెట్టుకునే హీరోలు చాలా అరుదుగా ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఒక కుటుంబానికి 11 ఏళ్లుగా అండగా ఉంటున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హిట్ సినిమాల్లో బాద్షా ఒకటి. ఈ సినిమాకు బండ్ల గణేష్ నిర్మాతగా వ్యవహరించగా.. శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు. ఆడియో లాంచ్ ఈవెంట్లో రాజేంద్రప్రసాద్ అనే వ్యక్తి మృతి చెందారు.
Advertisement
ఆ సమయంలో బండ్ల గణేష్ రాజేంద్రప్రసాద్ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అయితే తారక్ ఇప్పటికీ కూడా వారి కుటుంబానికి తన వంతు సహాయం చేస్తున్నాడని తెలుస్తోంది. ఫ్యాన్ ఫ్యామిలీ కోసం తారక్ ఇప్పటికీ సపోర్ట్ గా నిలబడుతున్నాడని అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఆ కుటుంబానికి ఏ అవసరం ఉన్నా తన దృష్టికి వచ్చిన వెంటనే రియాక్ట్ అవుతారని సమాచారం.
Advertisement
Also read:
ఈ విషయంలో తారక్ ని అంతా మెచ్చుకున్న తక్కువైనా అని అంతా అంటున్నారు. ఎన్టీఆర్ వంటి హీరోలు అరుదుగా ఉంటారని చెప్పొచ్చు. ఇంకో నెల రోజుల్లో దేవర సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ట్రైలర్ కి సంబంధించిన అప్డేట్ కోసం ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. అనుకున్న తేదీకి చెప్పిన విధంగా సినిమాను రిలీజ్ చేయడం కోసం మేకర్స్ ఎంతో కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!