Advertisement
మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అడుగు పెట్టనప్పటికీ ఆమెకు ఉన్న క్రేజ్ ఇంత అంతా కాదు. సెలబ్రిటీ కిడ్ అయినప్పటికీ ఒక స్టార్ రేంజ్ కి ఉండాల్సినంత ఫాలోయింగ్ ఉంది. ఈ ప్రిన్సెస్ ఇప్పటికే కొన్ని యాడ్స్ లో నటించింది. అలాగే సేవా కార్యక్రమాలు, సోషల్ మీడియా ద్వారా పాపులారిటీని తెచ్చుకుంది. ఇంటర్వ్యూలు కూడా ఇస్తోంది.
Advertisement
తాజాగా ఓ ఇంటర్వ్యూలో సితార చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. సితార ఫస్ట్ పిఎంసి జువెలరీస్ కి యాడ్ చేసిన విషయం మనకి తెలుసు. ఆ యాడ్ బాగా వైరల్ కూడా అయింది. ఆ యాడ్ చూసినప్పుడు మహేష్ ఎలా స్పందించారో సితార చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారని నాకు బాగా గుర్తుంది. నాన్న నా యాడ్ చూసి ఆల్మోస్ట్ ఏడ్చేశారు అని అన్నారు.
Advertisement
Also read:
ఇంట్లో అమ్మ చాలా స్ట్రిక్ట్. నాన్న నన్ను గారాబం చేస్తారు. స్కూల్ బంక్ కొట్టేది మా నాన్న వల్లే అని ఆమె అన్నారు. మా నాన్నకి వర్క్ లేనప్పుడు నన్ను స్కూల్ కి వెళ్లొద్దని అంటారని నన్ను స్కూల్ కి పంపించొద్దు అని అమ్మతో గొడవ పడతారని అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!