Advertisement
నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత 24 గంటల్లో ఈ సినిమాకి ఏకంగా రెండు లక్షల టికెట్లు అమ్ముడు అయ్యాయని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరపి లేని వర్షాలు సరిపోదా శనివారం కలెక్షన్స్ పై తీవ్రస్థాయిలో ప్రభావం చూపించాయి. స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటిస్తున్న నేపథ్యంలో చాలా మంది థియేటర్లలో మూవీ చూడాలని ఉన్నా వెనక్కి తగ్గిపోతున్నారు.
Advertisement
వర్షాలు తగ్గి సాధారణ పరిస్థితి ఏర్పడితే సరిపోదా శనివారం సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం కనబడుతోంది. ఆగస్టు 29వ తేదీన థియేటర్లలో ఈ సినిమా విడుదల కాగా పెద్దగా పోటీ లేకుండా రిలీజ్ అవ్వడం మూవీకి ప్లస్ అయింది. ఈ మూవీలో అటు నాని సూర్య అభినయంతో అదరగొట్టేశారు. ప్రియాంక అరుల్ మోహన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించారు.
Advertisement
Also read:
ఆమె నటనకు సైతం మంచి మార్కులు పడ్డాయి. గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అవుతుండడం కూడా సినిమా కలెక్షన్ల పై కొంత మేర ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయి. సరిపోదా శనివారం సినిమాకు 45 కోట్ల రూపాయల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా
బ్రేక్ ఈవెన్ కావాలంటే 46 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్స్ రావాలి.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!