Advertisement
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రజారాజ్యం నుంచి డిప్యూటీ సీఎం వరకు ఆయన పొలిటికల్ జర్నీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన అభిమానులు జనసైనికులే కాకుండా తెలుగు ప్రజలు అంతా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవికి అండగా ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు. పవన్ కళ్యాణ్ ఏ మాత్రం వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించారు. సొంతంగా జనసేన పార్టీని స్థాపించి కనీసం తనని తాను గెలిపించుకోలేకపోయిన స్థాయి నుంచి తాను మాత్రమే కాదు పోటీ చేసిన అందర్నీ గెలిపించుకునే స్థాయికి చేరుకున్నారు. ప్రజారాజ్యం నుంచి డిప్యూటీ సీఎం వరకు పవన్ కళ్యాణ్ జర్నీలో ఎన్నో కష్టాలని ఎన్నో తీపి జ్ఞాపకాలని ఎదుర్కొన్నారు.
Advertisement
Advertisement
డిప్యూటీ సీఎం హోదాలో అయినా తొలి బర్త్ డే జరుపుకుంటున్నారు. అన్న వెంట రాజకీయాల్లోకి ప్రవేశించి సొంతంగా పార్టీని స్థాపించి ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ప్రత్యర్థులతో పోరాడారు రాజకీయ వ్యూహాలు రచిస్తూ మిత్రులకు దగ్గరకు చేరుకుని ఎన్నికలవేళ అన్ని తానై ప్రచారం చేశారు దశాబ్దం కాలం పాటు అలుపెరగకుండా ప్రయాణం సాగిస్తేనే డిప్యూటీ సీఎం స్థాయికి వచ్చారు. పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీలో యువ విభాగానికి అధ్యక్షుడిగా పని చేశారు ఇదే రాజకీయాల్లో పవన్ కి మొదటి అడుగు. 2009లో ఉమ్మడి ఏపీలో జరిగిన ఎన్నికల్లో భారీ అంచనాలతో పోటీ చేసిన ప్రజారాజ్యం గెలవలేకపోయింది. ఈ ఫలితంతో నిరాశ చందన చిరంజీవి రాజకీయాలకు దూరమయ్యారు.
Also read:
ఏంటీ రజినీకాంత్ కూలీలో నాగార్జున అలాంటి పాత్ర చేస్తున్నారా..?
పవన్ కళ్యాణ్ మొండివాడు. అనుకున్నది సాధించేదాకా వదిలిపెట్టరు. అది నిజమేనని రాజకీయాల్లో కూడా నిరూపించుకున్నారు. 2014లో జనసేన పార్టీని స్థాపించి కొత్త అధ్యయనానికి తెర లేపారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా జనసేన పోటీ చేసింది కానీ టిడిపి జనసేన మధ్య ఓట్లు చీలిపోయి వైసీపీ లాభపడింది. 2019 ఓటమి తర్వాత చంద్రబాబు నాయుడు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. కానీ ఎన్నడూ వెనకడుగు వేయలేదు. 2024 ఎన్నికల్లో కూటమి గెలిచింది. పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచారు. డిప్యూటీ సీఎం గా కూడా తన విధులను నిర్వహిస్తున్నారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!