Advertisement
క్రికెటర్ ధోని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ధోని కెప్టెన్సీ లో చెన్నై టీం ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. ఐపీఎల్లో సీఎస్కే తరపున కూడా ధోని అద్భుతమైన బ్యాటింగ్ తో అనేక రికార్డులని సాధించారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు ధోని బ్యాటింగ్ కి వస్తే గ్రౌండ్లోకి వస్తూనే బౌండరీ పై నిలబడి ఆకాశం వైపు తిరిగి చూస్తారు. ధోని ఇలా ఎందుకు చేస్తాడో తెలుసా..? మరి కొద్ది నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగబోతోంది మరో సీజన్లో సీఎస్కే తరఫున ఆడాలనే కోరికను ధోని వ్యక్తం చేశారు. మెగా వేలానికి వెళ్లడం ఇష్టం లేదని తక్కువ మొత్తానికి అతని ఉంచుతారో లేదో చూడాలని ధోని టీం మేనేజ్మెంట్ కి సూచనలు పంపించారట.
Advertisement
బౌండరీ లైన్ పై నిలబడి ఆకాశం వైపు చూడడం గురించి ధోని చెప్తూ నాకు ఇది అలవాటు. ఎడమవైపు ఎందుకు చూస్తారని అడిగితే నాకు ఇది ప్రశ్నకు సమాధానం తెలియదు. ఇది నా జీవితంలో అతిపెద్ద గందరగోళం అని నేను చెప్తాను. ఎందుకంటే బ్యాటింగ్ కి వెళ్ళినప్పుడు బౌండరీ లైన్ దాటాలి. బౌండరీ లైన్ దగ్గరకు వచ్చిన ప్రతిసారి ఎడమ పాదమా కుడి పాదమా అనే ప్రశ్న తలెత్తుతుంది అని ధోని చెప్పారు.
Advertisement
Also read:
Also read:
గ్రౌండ్లో ఏ కాలు మొదట పెట్టాలనే విషయం మాములే కానీ ప్రతిసారి నాకు ఈ గందరగోళం వస్తుంది కొన్నిసార్లు సూర్యుడు ఎడమవైపున ఉంటాడు. అది ఒక కారణం అవ్వచ్చు. డే అండ్ నైట్ మెసేజ్ సమయంలో కొన్ని సార్లు చూడడం అలవాటుగా మారిపోయింది. కుడివైపు చూసే అలవాటు లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నా చూపు ఎడం వైపు ఉంటుంది అని చెప్పారు. నా భార్య అటువైపు కూర్చోడం వలన కూడా అలా చూడొచ్చని ధోని సమాధానం చెప్పారు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!