Advertisement
సీజన్ బాలేదు. చాలామంది వైరల్ ఫీవర్స్ కారణంగా ఇబ్బంది పడుతున్నారు. రోజురోజుకీ వైరల్ ఫీవర్స్ ఎక్కువగా పెరుగుతున్నాయి. ఒకరి నుంచి మరొకరికి సోకుతున్నాయి. వీటిని చెక్ పెట్టడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో ఏఏ జాగ్రత్తలు తీసుకుంటే జ్వరం రాదు..? అనేది ఇప్పుడు చూద్దాం. బయటికి వెళ్లి వచ్చిన ప్రతిసారి, ఏదైనా తినడానికి ముందు, రెస్ట్ రూమ్ వాడిన ప్రతిసారి, దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు చేతుల్ని క్లీన్ గా ఉంచుకోవాలి. దగ్గడం, తుమ్మడం చేస్తే మీ చేతులతో కవర్ చేసుకోండి. ఇలా చేసిన తర్వాత చేతుల్ని క్లీన్ చేసుకోండి.
Advertisement
Advertisement
బాడీలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఇమ్యూనిటీ సరిగ్గా ఉంటే అనారోగ్య సమస్యలు రావు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం, ఎక్కువ సేపు నిద్రపోవడం, ఇమ్యూనిటీని పెంచుతాయి. ఎన్నో సమస్యలకు దూరంగా ఉండవచ్చు. జ్వరం వచ్చిన వారికి దూరంగా ఉండాలి. జ్వరం వచ్చిన వాళ్ళు వాడే కప్స్, బట్టలు వంటి వాటిని మీరు వాడొద్దు. వారికి దూరంగా ఉండాలి.
Also read:
దోమల వలన వైరల్ ఫీవర్స్ ఎక్కువగా వస్తాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ముందు, చుట్టుపక్కల నీరు నిల్వ లేకుండా చేసుకోవాలి. దోమల నుంచి కాపాడడానికి బాడీని కవర్ చేసే బట్టలు వేసుకోండి. చల్లగా ఉన్నప్పుడు నీరు తాగడం చాలామందికి ఇష్టం ఉండదు. కానీ హైడ్రేట్ గా ఉండడానికి నీళ్లు తాగాలి.
ఆరోగ్యకరమైన చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!