Advertisement
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం కారణంగా అతి భారీ వర్షాల వలన రెండు తెలుగు రాష్ట్రాలు దారుణంగా దెబ్బతింటున్నాయి. వాయుగుండం ప్రభావంతో తెలంగాణ ఉత్తర ప్రాంత జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ తో పాటుగా నిజామాబాద్, జగిత్యాల, అదిలాబాద్ ఇలా పలు ప్రాంతాలలో ఉండే చెరువులు కుంటలు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కోస్తా తీర ప్రాంతాలను భారీ వర్షాలు అతలాకుతలం చేసేశాయి. రాజధాని అమరావతి మొత్తం నీట మునిగిపోయింది. విజయవాడలో అయితే పరిస్థితి ఘోరంగా ఉంది.
Advertisement
కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాలో వరద ఉధృతి నెలకొంది. వేలాది మంది ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు చేరేలా అధికారులు చూశారు. ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వలన కృష్ణా నది ఉగ్రరూపాన్ని ధరించింది. వరద నీటితో పోటెత్తింది. ఈ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల చొప్పున విరాళాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
Advertisement
Also read:
ఈమేరకు కొద్దిసేపటి క్రితమే ఒక ట్వీట్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన జరుగుతున్న వరద బీభత్సం ఎంతగానో కలచి వేసిందని ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాడని అన్నారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయనిధికి చేరుక 50 లక్షల రూపాయలను విరాళంగా ప్రకటిస్తున్నారని ఆయన చెప్పారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!