Advertisement
35 Chinna Katha kadhu Review: నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అరుణ్ దేవ్, అభయ్, అనన్య తదితరులు ఈ సినిమాలో నటించారు. నంద కిషోర్ ఈమని ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి ఈ మూవీని నిర్మించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.
Advertisement
సినిమా: 35 చిన్న కథ కాదు
నటీ నటులు: నివేత థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, గౌతమి, భాగ్యరాజ్, కృష్ణ తేజ, అరుణ్ దేవ్, అభయ్, అనన్య తదితరులు
దర్శకత్వం: నంద కిషోర్ ఈమని
నిర్మాత: సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్ళపల్లి
మ్యూజిక్: వివేక్ సాగర్
రిలీజ్ డేట్: 05-09-2024
కథ మరియు వివరణ:
తిరుపతిలో సరస్వతి (నివేదా థామస్), ప్రసాద్ (విశ్వ దేవ్)లది ఉంటారు. వీరికి ఇద్దరు కొడుకులు అరుణ్, వరుణ్. వీళ్ళు స్కూల్‌కు వెళ్తుంటారు. పెద్ద కొడుకు అరుణ్ కొంచెం డిఫరెట్. అందరిలా కాదు. దేన్నీ గుడ్డిగా ఫాలో అవ్వడు. లెక్కల్లో ఉండే ఫండమెంటల్స్, బేసిక్స్‌ను ప్రశ్నిస్తుంటాడు. సున్నాకి విలువ లేకపోతే దాని పక్కన ఒకటి పెడితే.. దాని విలువ ఎలా మారిపోతుంది..? సున్నా అంటేనే ఏమీ లేనప్పుడు దాని కంటే తక్కువ మైనస్ అని ఎలా అంటారు ఇలా ఆలోచిస్తాడు. వీటిని ఏ మాస్టర్ కూడా అర్థం చేసుకోడు. అరుణ్ తెలివి తేటలపై తల్లి సరస్వతికి బాగా నమ్మకం ఎక్కువ. స్కూల్లో కొత్తగా వచ్చిన లెక్కల మాస్టర్ చాణక్య (ప్రియదర్శి) అరుణ్‌ను జీరో అని ఎగతాళి చేస్తాడు. జీరో అని పిలవడం మొదలు పెడుతాడు. చాణక్య రాకతో అరుణ్ జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి…? అరుణ్ కి వచ్చిన సమస్యలు ఏంటి..? తల్లి కనీసం 35 మార్కులు తెచ్చుకునేలా ఎలా ప్రిపేర్ చేయించింది..? చివరకు అరుణ్ ఏం చేశాడు…? ఇదే కథ.
Advertisement
చిన్న చిన్న ఎమోషన్స్ ని ప్రేక్షకుడి హృదయాన్ని తాకే విధంగా సినిమాని తీసుకువచ్చారు. 35 అనే టైటిల్ కూడా ఈ సినిమాకి బాగా ఉంది. 35 మార్కులు తెచ్చుకోవడానికి ఆ పిల్లవాడు పడే ఆవేదన తల్లి మీద చూపించే ప్రేమ తండ్రి తన బాధ్యతను నిర్వర్తించడానికి చేసే పోరాటం అన్ని ఒక మిడిల్ క్లాస్ లైఫ్ నీ కళ్ళముందు కట్టినట్లు చూపించారు. కె విశ్వనాథ్ సినిమాలు చూస్తున్నప్పుడు ఎలాంటి ఫీల్ అయితే వచ్చిందో అలాంటి ఫీల్ ఈ సినిమా తీసుకువచ్చింది. ఎక్కడ బోర్ కూడా కొట్టలేదు ఈ మూవీలో కొన్ని ఎమోషన్స్ హైలెట్ అవడంలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి చాలా దాకా ప్లస్ అయింది.
సెకండ్ హాఫ్ లో వచ్చిన కొన్ని సీన్స్ కొన్ని మెలో డ్రామలాగ అనిపించింది. సీన్లు కొంచెం స్లోగా ఉన్నాయి ఈ సినిమాలో నటులు ఎవరి పాత్రకి తగ్గట్టుగా వాళ్ళు అద్భుతంగా నటించారు టెక్నికల్ అంశాలు కూడా ఈ సినిమాకు బాగానే ప్లస్ అయ్యాయి. మ్యూజిక్ అందించిన వివేక్ సాగర్ తన గత సినిమాలకు ఏమాత్రం తీసుకొని విధంగా మ్యూజిక్ ని అందించారు. సినిమాటోగ్రఫీ కూడా ప్లస్ అయింది.
Also read:
ప్లస్ పాయింట్స్
కథ
నివేద నటన
ఎమోషన్స్
మైనస్ పాయింట్స్
అక్కడక్కడ కొన్ని సీన్స్ మెలో డ్రామాలా అనిపించాయి
సెకండ్ హాఫ్ నెమ్మదిగా సాగడం
రేటింగ్: 2.5/5
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!