Advertisement
The Greatest of All Time Review: విజయ్, మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, ప్రేమ్ జీ తదితరులు
ఈ సినిమాలో నటించారు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. కల్పత్తి ఎస్ అఘోరం, కల్పత్తి ఎస్ గణేష్, కల్పత్తి సురేష్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
Advertisement
సినిమా: ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం
నటీ నటులు: విజయ్, మీనాక్షి చౌదరి, స్నేహ, ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, ప్రేమ్ జీ తదితరులు
దర్శకుడు: వెంకట్ ప్రభు
నిర్మాత: కల్పత్తి ఎస్ అఘోరం, కల్పత్తి ఎస్ గణేష్, కల్పత్తి సురేష్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్ నుని
విడుదల తేదీ: 05-09-2024
కథ మరియు వివరణ:
యాంటీ టెర్రరిస్ట్ గ్రూప్ కి లీడర్ గాంధీ (విజయ్) కెన్యాలో ఒక మిషన్ చేపడతారు. దీనితో అతడి జీవితంలో మార్పులు వస్తాయి. భార్యాబిడ్డలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి కలుగుతుంది. ఆ మిషన్ తర్వాత ఏజెన్సీ ఉద్యోగం వదిలేస్తాడు. సాధారణ జీవితం గడుపుతుంటాడు. చిన్నప్పుడు చనిపోయాడనుకున్న కొడుకు జీవన్ (విజయ్) మళ్ళీ కనిపించడంతో కోల్పోయిన ఆనందం మళ్ళీ దొరికింది అనుకుంటాడు. గాంధీ టీమ్ మెంబర్స్ ఒక్కొక్కరుగా చనిపోతుంటారు. వారి మరణాల వెనుక ఉన్నది ఎవరు..? కెన్యాలో చేపట్టిన మిషన్ ఏమిటి..? ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాలి.
Advertisement
ఈ మూవీలో విజయ్ కి విగ్ అస్సలు సెట్ అవ్వలేదు. డీ-ఏజింగ్ టెక్నాలజీతో తీర్చిదిద్దిన విజయ్ మాట్లాడేప్పుడు చూడడానికి అస్సలు బాలేదు. ఈ మూవీలో విజయ్ కాంత్ ను రీక్రియేట్ చేసి చూపించడం తమిళ సినిమా అభిమానులకు బాగా కనెక్ట్ అవుతుంది. మిగిలిన వారు కూడా బానే పాత్రలకు తగ్గట్టు అలరించే ప్రయత్నం చేసారు. మీనాక్షి చౌదరి కేవలం ఒక పాట, రెండు సీన్స్ లో మెరిసి మాయమైపోయింది. మోహన్ విలనిజాన్ని పండించలేకపోయాడు. యువన్ శంకర్ రాజా ఎలివేషన్స్, ట్విస్ట్స్ ను తన నేపథ్య సంగీతంతో ఎలివేట్ చేయలేకపోయాడు. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా పెద్దగా ఏమీ లేదు. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో చేసిన మార్పులు సినిమాకి ప్లస్ అయ్యాయి. ఈ మూవీ హాలీవుడ్ చిత్రం “జెమినీ మ్యాన్” ని కాపీ పేస్ట్ చేసినట్టే ఉంటుంది.
Also read:
ప్లస్ పాయింట్స్
నటులు
కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్
డీ-ఏజింగ్ టెక్నాలజీ
సంగీతం
కథ
Rating: 2/5
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!