Advertisement
2008లో సాక్షి పేపర్ వచ్చింది, రెండు రూపాయలకే పత్రిక ఇచ్చి రంగురంగుల పేజీల్ని ప్రచురించింది. పోటీపత్రికల్ని కూడా ఇదే తరపు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అప్పట్లో సాక్షి కాంగ్రెస్ పార్టీ గొంతుకగా ఉంది. కాలం మారిపోయింది. రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత సాక్షి కూడా తన గొంతును మార్చుకుని ఈ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా స్వరం వినిపించడం మొదలుపెట్టింది. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షి పత్రికను ఏపీలో పత్రికకు ఏ పత్రిక ఎదురు లేదు. ప్రభుత్వ ప్రకటనలతో రోజూ నీలం తెలుపు ఆకుపచ్చ రంగులతో కనపడేవి.
Advertisement
జగన్ చేపట్టే ప్రతి పథకానికి సంబంధించిన ప్రకటన సాక్షిలో వచ్చేది. జగన్ సొంత పత్రిక సాక్షి కాబట్టి అడ్డగోలుగా ప్రభుత్వ ప్రకటనలు వచ్చేవి. ఐదేళ్లపాటు సాక్షికి వందల కోట్ల ప్రభుత్వ ధనం ప్రకటన రూపంలో వచ్చింది. అప్పట్లో ఏపీలోని ప్రతి కార్యాలయంలో సాక్షి పత్రికలు వేయించుకునే వాళ్ళు. వాలంటీర్లు కూడా ప్రభుత్వ ఆదేశాలు నేపథ్యంలో సాక్షి పత్రికను కొనేవారు ఫలితంగా అప్పట్లో సాక్షి పత్రిక సర్కులేషన్ పెరిగినట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఈనాడు కోర్టుకు వెళ్ళింది. కోర్టు సాక్షికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది ఈలోగా అధికారం పోవడంతో సాక్షి పత్రికకు బ్యాడ్ టైం మొదలైంది.
Advertisement
Also read:
ఇప్పుడు ఏపీలో ఎలాగూ ప్రభుత్వ ప్రకటనలు వచ్చే అవకాశం లేకపోతే సాక్షికి ప్రైవేట్ యాడ్స్ ఒక్కటే దిక్కు. సర్కులేషన్ ఉంటేనే ప్రైవేట్ యాడ్స్ వస్తుంటాయి. ఈ క్రమంలో సర్క్యులేషన్ పెంచుకోవడానికి సాక్షి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. కాంప్లిమెంటరీ కాపీల పేరుతో ప్రజలకు ఉచితంగా పత్రికల్ని పంపిణీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా సంవత్సర చందా 1250 రూపాయలు మాత్రమే అంటూ ఆఫర్ కూడా ప్రకటించింది. ఇది వరకు సంవత్సర చెందాతో పాటు కుక్కర్ లేదా ఇంటి సామాన్లు అన్ని ఉచితంగా ఇచ్చేవారు. ప్రస్తుతం ఏపీలో సాక్షి సర్కులేషన్ 4 లక్షలుగా ఉందని తెలుస్తోంది జగన్ ప్రభుత్వం అధికారం కోల్పోయాక క్రమేపి సర్క్యులేషన్ పడిపోయిందని తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!