Advertisement
బిగ్ బాస్ హౌస్‌లో రాణించడం ఈజీ కాదు. మానసికంగా, శారీరకంగా స్ట్రాంగ్ గా ఉండాలి. భారీ అంచనాల మధ్య హౌస్ లో అడుగుపెట్టిన టాప్ సెలబ్రిటీస్ కూడా బోల్తా పడిన సందర్భాలు ఉన్నాయి. పల్లవి ప్రశాంత్ ని ఎవరైనా గట్టిగా టార్గెట్ చేస్తే ఏడ్చేసేవాడు. పల్లెటూరు నుంచి వచ్చాడన్న సింపతిని వాడుకున్నాడు. అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి. అమర్ దీప్ తో పాటు కొందరు కంటెస్టెంట్స్ అతడు సింపతి కార్డును వాడుతున్నాడని నిరూపించడానికి ప్రయత్నం చేసారు. పల్లవి ప్రశాంత్ జోలికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నెగిటివ్ అయిపోయారు. ప్రైజ్ మనీ పేదలకు పంచుతానని చెప్పి ఇంకో బలమైన ఆస్త్రాన్ని వదిలాడు.
Advertisement
ఫిజికల్ టాస్క్‌లలో రాణించడం పల్లవి ప్రశాంత్ కి ప్లస్ అయింది. టాప్ సెలబ్రెటీస్ ని కూడా వెనక్కి నెట్టి టైటిల్ ని గెలుచుకున్నాడు. ఆ తరహాలోని ఇప్పుడు నాగ మణికంఠ హైలైట్ అవుతున్నాడు. ప్రతి మాటలో ఎమోషన్ ఉండేలా చేస్తున్నాడు. తన తల్లిదండ్రులు లేని పిల్లాడని నిరూపించుకోవాలని అనుకుంటున్నాడు. కమ్యూనిషన్స్ లో శేఖర్ భాషతో వాగ్వాదం జరిగింది వెంటనే కన్నీటి గాధను స్టార్ట్ చేశాడు.
Advertisement
Also read:
చిన్నప్పుడే తండ్రి చనిపోతే తల్లి వేరే పెళ్లి చేసుకుందని.. సవిత తండ్రి అవమానించాడు ఎన్నో బాధల కి గురి చేసాడని చెప్పుకొచ్చాడు. తల్లి చనిపోతే కట్టెలకు డబ్బులు లేక అడుక్కున్నానని ఏడ్చాడు. నాగమణికంఠ మాటలకు ఇతర కట్టిస్తే కన్నీళ్లు పెట్టుకున్నారు కన్ఫర్మేషన్ రూమ్ లో భారీ డ్రామా చేశాడు. నాకు భార్య కూతురు కావాలి అత్తమామల నుంచి రెస్పెక్ట్ కావాలి. స్టెప్ ఫాదర్ డబ్బులు కావాలి బయటకు వెళ్లాక నాకు జీవితం ఉందో లేదో అంటూ గట్టిగా ఎడ్చేసాడు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!