Advertisement
హిందువులు జరుపుకునే ముఖ్య పండుగలో వినాయక చవితి ఒకటి. వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుతారు. తొమ్మిది రోజులు పాటు వినాయకుడికి పూజలు చేసి తర్వాత నిమజ్జనం చేస్తారు. గణపతి నవరాత్రులు పాటించాలని భావించేవారు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించే క్రమంలో కొన్ని వాస్తు నియమాలను పాటించాలి ఇలా చేయడం వలన లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఆ వాస్తు నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
వినాయకుడు విగ్రహాన్ని తీసుకోచ్చేటప్పుడు వినాయకుడు తొండం ఎప్పుడూ కూడా ఎడమవైపు ఉండేటట్టు చూసుకోవాలి. వినాయకుడికి తొండం ఎడమవైపుకి వంగి ఉంటే అది అత్యంత పవిత్రమైనదిగా భావించాలి. ఇలాంటి వినాయకుడుని పూజిస్తే చాలా మంచిది. అలాగే వినాయకుడి వాహనమైన ఎలుక ఉన్న విగ్రహాన్ని కొనుగోలు చేయడం మంచిది. ఎలుక, మోదకం లేకపోతే శుభప్రదంగా ఉండదని అంటారు. వినాయకుడి విగ్రహాన్ని తీసుకువచ్చేటప్పుడు దాని రంగును కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
Advertisement
Also read:
ఎరుపు రంగు వినాయకుడి ఇంట్లో ప్రతిష్ఠిస్తే కుటుంబ సభ్యుల ఆత్మవిశ్వాసం పెరుగుతుందట తెలుపు రంగులో ఉన్న వినాయకుడిని ప్రతిష్టిస్తే ఆనందం కలుగుతుందట. వాస్తు ప్రకారం వినాయకుడు విగ్రహాన్ని తీసుకువచ్చిన తర్వాత ఉత్తర దిశ వైపు వినాయకుడిని ప్రతిష్టించాలి. ఉత్తరం వైపు వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించ లేకపోయినట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి అభిముఖంగా తూర్పు దిశగా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించాలి. ఇలా చేస్తే సంతోషం సంపద కలుగుతాయి. కుటుంబ సభ్యులు సంతోషంగా ఉంటారు. లక్ష్మీ కటాక్షంతో సిరిసంపదలు తో సుఖంగా ఉంటారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!